హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆరోగ్య మహిళా స్కీంలో ఈ టెస్టులు అన్ని పూర్తిగా ఉచితం!..

ఆరోగ్య మహిళా స్కీంలో ఈ టెస్టులు అన్ని పూర్తిగా ఉచితం!..

X
మహిళలకు

మహిళలకు టెస్టులు ఫ్రీ

Telangana: రాష్ట్రంలో ప్రతి మహిళా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వంఅరోగ్య మహిళ అనే కొత్త స్కీంను అమలు చేస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(santosh, News18, Peddapalli)

రాష్ట్రంలో ప్రతి మహిళా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వంఅరోగ్య మహిళ అనే కొత్త స్కీంను అమలు చేస్తుంది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ అనే అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాకి కొన్ని మాత్రమే ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇందులో పెద్దపల్లి జిల్లాలో మూడు కేంద్రాల్లో ఈ స్కీం అమలు అవుతుంది. పెద్దపల్లి, గద్దెలపల్లి, రామగుండం యూపీహెచ్సిలలో ఈ ఆరోగ్య స్కీం ద్వారాప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకువైద్య సేవలు అందిస్తున్నాయి. మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం 8 రకాల ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.

మహిళల్లో అరోగ్య మహిళ స్కీం నుండి మంచి స్పందన లభిస్తుంది. ఆయ డివిజన్లలో పని చేసే ఆశ వర్కర్లు, ఏఎన్ ఎంలు ఇంటి ఇంటికి వెళ్లి మహిళలతో స్కీంపై అవేర్నెస్ చేస్తున్నారు. ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులకు చెప్పుకోవడం ఇష్టం లేక కొందరు, వ్యాధి లక్షణాలపై అవగాహన లేక మరికొందరు, వ్యయ ప్రయాసలు ఓర్చే పరిస్థితి లేక ఇబ్బంది పడేవారు ఆరోగ్య మహిళ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.

అక్కడ ఉచిత పరీక్షలు చేసుకుంటున్న మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినందుకు ప్రతి మహిళ దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు వెల్లడిస్తున్నారు.

”అరోగ్య మహిళ” లో చేసే టెస్టుల వివరాలు..

1, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు

2, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్..

3, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.

4, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.

5, మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో అవగాహన కలిగిస్తారు.

6, నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.

7, సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.

8, బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు. యూపీహెచ్సీలో స్క్రీనింగ్ చేశాక జిల్లా హాస్పిటల్ కి పంపుతున్నారు. అక్కడ సంబంధిత రిజల్ట్ రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది. ఏదైనా వ్యాధి నిర్ధారణ అయిందంటే, ఏ స్టేజ్ లో ఉందో చూసుకొనే దానికి సంబధించిన ప్రభుత్వ వైద్యులకు రిఫర్ చేస్తున్నారు. అక్కడ వారికి ఉచితంగా మందులు ఇస్తున్నారు.

ఈ స్కీం ముఖ్య ఉద్దేశం..

మహిళలు నిత్యం ఏదో పని పడి తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. కొందరు కొన్ని వ్యాధులు చెప్పుకోలేరు. కొందరు డబ్బులు లేక ఆసుపత్రులకు పోరు.. ఇలా మహిళ ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నా.. దిగ మింగుకొని లోపాల ఉన్న వ్యాధిని మించి వచ్చే వరకు తెచ్చుకుంటున్నారు. ఈ స్కీం ద్వారా మొదటి స్టేజీలోనే ఆ వ్యాధిని అరికట్టే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మహిళ అరోగ్య మహిళగా ఉండాలనేఈ స్కీం ముఖ్య ఉద్దేశం అని మెడికల్ ఆఫీసర్ మాధురి అన్నారు. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవాలని అన్నారు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు