Home /News /telangana /

PEDDAPALLI ADMISSIONS INCREASED WITH THE INTRODUCTION OF ENGLISH MEDIUM IN RAMAGUNDAM ZILLA PARISHAD SCHOOL ABH BRV PSE

Peddapalli: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఇంగ్లీష్ మీడియం తరగతులు, అడ్మిషన్ల కోసం పోటెత్తిన విద్యార్థుల

పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (temporary town ship)లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభం అయ్యాయి. నాణ్యమైన విద్యా, మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్స్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు

పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (temporary town ship)లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభం అయ్యాయి. నాణ్యమైన విద్యా, మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్స్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు

ఇంకా చదవండి ...
    (E.Santosh, News 18, Peddapalli)

    రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పాఠశాల స్థాయి విద్యను మరింత మెరుగుపరుస్తూ.. భవిష్యత్తు అవసరాలకనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దెందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని, పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ‘మన ఊరు మన బడి’ అనే కార్యక్రమం కూడా తీసుకువచ్చింది ప్రభుత్వం.

    ఇప్పటికే తెలంగాణ గురుకులాలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో, గ్రామ స్థాయిల్లోంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని కేబినెట్ అభిప్రాయపడింది. అదే సందర్భంలో రాష్ట్రంలో వ్యవసాయం తదితర అనుబంధ రంగాలు బలోపేతం కావడం, తద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం, పల్లెల్లో తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని కేబినెట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు డిమాండు పెరుగుతుండటంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రవేశపెట్టడం జరిగింది.

    ఈక్రమంలో పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (temporary town ship)లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభం అయ్యాయి. పాఠశాలలో నాణ్యమైన విద్యా, మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్స్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. ఇంగ్లీష్ లోనే తరగతులు చెబుతుండడంతో ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజుల భారం నుండి మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులకు ఉపశమనం లభించినట్లైంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో ఈ ఏడాది అడ్మిషన్లు అధికంగా పెరిగాయని, పాఠశాల ఇంఛార్జి హెచ్ ఎం వెంటేశ్వర్లు తెలిపారు. విశాలమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాల కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా అన్ని వసతులతో విద్యా బోధన చేస్తున్నట్లు హెచ్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు.



    మరికొన్ని సమస్యలు ఉన్నాయి: స్వర్ణలత, ఉపాధ్యాయురాలు ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర విద్యాశాఖ ‘‘మన ఊరు – మన బడి’’ అనే వినూత్న కార్యక్రమాన్నీ చేపట్టింది. ఇందులో భాగంగా ఈ పాఠశాలకు డైనింగ్ హాల్ కేటాయించారు. కానీ ప్రస్తుతం ఈ పాఠశాల ఉన్న భవనం ఎన్టీపీసీ యాజమాన్య పరిధిలోకి వస్తుండడంతో.. డైనింగ్ హాల్ నిర్మాణానికి ఎన్టీపీసీ యాజమాన్యం నుంచి ఇంకా పర్మిషన్ రాలేదని ఉపాధ్యాయులు చెప్తున్నారు. స్థానిక మహిళ సంఘాలుకు మధ్యాహ్న భోజన పనులు అప్పగించాల్సి ఉండగా..రమేష్ అనే వ్యక్తి టెండర్ తీసుకొని భోజన సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. వంటలు బాగానే ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆమోదించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనంలో గుడ్డు పెట్టడం లేదు. ఇదే విషయమై సదరు వంట సిబ్బందిని ప్రశ్నించగా గుడ్డు రేటు పెరగడంతో తమకు గిట్టుబాటు కావడం లేదంటూ సమాధాన చెప్పడం గమనార్హం. మరోవైపు వంట చేసే 8 మంది మహిళా సిబ్బందికి నెలకు రూ. వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉండగా అవి కూడా అందడం లేదని మహిళలు వాపోయారు.

    School address:ZPHS NTPC JYOTHINAGAR, School- Ramagundam-2, Peddapalli, School HM Contact Number: 9949749523
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: EDUCATION, Local News, Peddapalli, Telangana

    తదుపరి వార్తలు