హోమ్ /వార్తలు /తెలంగాణ /

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభం.. ఇలా అప్లై చేయండి!..

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభం.. ఇలా అప్లై చేయండి!..

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు..

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు..

Telangana: తమ పిల్లలను కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు కేంద్రీయ విశ్వవిద్య పాఠశాలలో వచ్చే ఆకడమిక్ సం వత్సరానికిప్రవేశాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Santosh, News18, Peddapalli)

తమ పిల్లలను కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు కేంద్రీయ విశ్వవిద్య పాఠశాలలో వచ్చే ఆకడమిక్ సం వత్సరానికిప్రవేశాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.

దరఖాస్తు ఇలా చేసుకోవాలి..

ఆన్లైన్ విదానం ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ kvsonlineadmission.kvs.gov.in ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్లోకి వెళ్లిన తర్వాత లాగిన్ అయ్యాక దరఖాస్తు పూర్తిగా నింపాలి. అవసరమైన ఏవైతే వారు పత్రాలు అడుగుతారో అవి తప్పని సరిగా అప్లోడ్ చేయాలి. పూర్తి అయ్యాక మరోసారి పరిశీలించుకుని సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఒక్కసారి దరఖాస్తు చేసిన తర్వాత మళ్లీ మార్పులు చేసేందుకు అవకాశం ఉండదు.

ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 27 నుంచి ఏప్రిల్ 17వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీలను ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేస్తారు. రెండో తరగతి ఆపైన అడ్మిషన్లకు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ జాబితాను ఏప్రిల్ 17న విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఏప్రిల్ 18 నుంచి 29వరకు ప్రవేశాలు కల్పిస్తారు. 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, సింగల్ గర్ల్ చైల్డ్ కి లాటరీ ద్వారా కేటాయిస్తారు. దివ్యాంగులకు 3 శాతం, ఓబీసీలకు 27 శాతం, సీట్లను కేటాయిస్తారు. రెండో తరగతి నుంచి 11వ తరగతి వరకు విద్యాలయంలో ఉన్న ఖాళీలను బట్టి ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రాధాన్యత ఇలా ఇస్తారు..

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్, ఎల్బీసీ, బ్యాంకు , పోస్టల్ శాఖల ఉద్యోగుల పిల్లలకు రెండో ప్రాధాన్యత ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మూడో ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్ తదితర ఉద్యోగుల పిల్లలకు నాలుగో ప్రాధాన్యత కల్పిస్తారు. సాధారణ ప్రజల పిల్లలకు తుది ప్రాధాన్యత ఉంటుంది.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు