E. Santosh, News18, Peddapalli
నిన్నే ప్రేమించాను, నువ్వే సర్వసం అన్నాడు ఆ యువకుడు. మొదట్లో ఒప్పుకోకపోయినా ప్రేమపై ఉన్న నమ్మకంతో ఆ యువతి కూడా అతని కపట ప్రేమను అంగీకరించింది. పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళి ఒంటరిగా వదిలేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువతి సెల్ఫీ వీడియో (Selfie Video) లో తన ఆవేదన వెళ్లగక్కి ఆత్మహత్య చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఘటనలో వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా (Manchiryal District) బెల్లంపల్లి (Bellampalli) పట్టణంలోని షంషీర్ నగర్‌కు చెందిన తేజశ్రీ.. నెన్నెల మండలం లంబాడితండాకు చెందిన ధరావత్ రాజ్‌కుమార్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెద్దలకి తెలిస్తే ఒప్పుకోరని భావించిన ఇద్దరు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. యువతిని బయటకు తీసుకెల్లిన రజుకుమార్ ఆమెను అద్దె గదిలో ఉంచాడు. పెళ్లి విషయం ప్రస్తావించగా రేపుమాపు అంటూ కాలక్షేపం చేస్తూ గడిపాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ ఇబ్బందిగా మారడంతో తేజ శ్రీ కాస్త గట్టిగా నిలదీయడంతో రాజ్‌కుమార్ ముఖం చాటేశాడు. ఫోన్లో కూడా సమాధానం ఇవ్వకుండా తేజ శ్రీ వద్దకు రాకుండా ఉండటంతో మోసపోయానని గ్రహించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిన రాజ్ కుమార్ మాటలే వేదంగా నమ్మి.. కుటుంబాన్ని వదిలేసి వచ్చిన తేజ శ్రీ.. ప్రియుడి చేతిలో మోసపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చావే శరణ్యంగా భావించి పురుగుల మందు సేవిస్తూ సెల్ఫ్ వీడియో రికార్డు చేసింది. మందు సేవించిన కాసేపటికి ఆటోలో ప్రయాణం చేస్తుండగా తేజ శ్రీ ఆటోలో కుప్పకూలిపోగా డ్రైవర్ హుటాహుటినా దగ్గర్లో ఉన్న ఆరోగ్యకేంద్రానికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే తేజశ్రీ మరణించింది.
ప్రేమించిన వాడు జీవితాన్ని ఇస్తాడని నమ్మి వస్తే వాడి నయవంచన గ్రహించలేక పోయింది తేజ శ్రీ. "నేను నీకు ఏం అన్యాయం చేశానని నాకు అన్యాయం చేసావు రాజు. ప్రేమిస్తున్నా అని అన్నావు, పెళ్లి చేసుకుంటా అన్నవు, నేను లేకుంటే చచ్చిపోతాను అన్నావు, నిన్ను నమ్మి బయటకు వచ్చిన నన్ను చివరకు పెళ్లికి నిరాకరించావు, నేను నీకు ఎం అన్యాయం చేశాను, నాతో అందరికీ ఫోన్ చేయించావు, అది కూడా తప్పు అన్నావు, నువ్వు చేయమంటేనే కదా చేశాను, నన్ను ఒంటరిగా వదిలేసావు నాకు దిక్కెవ్వరు," అంటూ సెల్ఫీ వీడియోలో తేజశ్రీ చెప్పిన ఈ మాటలు అందరిని కలచివేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Love cheating, Mancherial, Telangana