హోమ్ /వార్తలు /తెలంగాణ /

నోరు లేని జీవాలను రక్షిస్తున్న యువకుడు..

నోరు లేని జీవాలను రక్షిస్తున్న యువకుడు..

X
మూగజీవాలకు

మూగజీవాలకు సేవ చేస్తున్న యువకుడు

Telangana: ప్రస్తుతo ఉన్న బిజీ లైఫ్‌లో ముందుకు దూసుకుపోవడమేగానీ.. పక్కవారిని పట్టించుకునే తీరికలేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ప్రస్తుతo ఉన్న బిజీ లైఫ్‌లో ముందుకు దూసుకుపోవడమేగానీ.. పక్కవారిని పట్టించుకునే తీరికలేదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులనే పలకరించే సమయం కూడా లేనంత బిజీ లైఫ్ లో ఉంటున్నారు యువత. కానీ కొందరు మాత్రం ఎక్కడో చోట వారి సేవా గుణంతో సాయం చేస్తుంటారు. అందులో ఈయన తీరే కొంచం సపరేటు. ఈయన మూగ జీవాలకు ప్రాణం పోస్తుంటాడు. పెద్దపల్లి గోదావరిఖనికి చెందిన అరవింద్ స్వామి వయసు 25 ఏళ్లు.. చదివింది డిప్లొమా ఎలక్ట్రికల్. ప్రస్తుతానికి ఇతను రామగుండం ఎరువుల కర్మాగారంలో సూపర్వైజర్ గా తన విధులు నిర్వహిస్తున్నాడు.

అరవింద్ స్వామికి చిన్న నాటి నుండి మూగ జీవాలపై అమిత ప్రేమ ఎక్కువ కాగా.. ఆవులు అంటే బాగా ప్రేమ. ఓ రోజు అరవింద్ స్వామి ప్రయాణిస్తుండగా ఓ భారీ వాహనం ఆవును గుద్దేసింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోగా అరవింద్ ఆవును వెటర్నిరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ఆవుకు కావాల్సిన ట్రీట్మెంట్ చేయించి అవును తానే సంరక్షిస్తున్నాడు.

రోడ్డెక్కిన మనిషికే సేఫ్టిలేని ఈరోజుల్లో మూగ జీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రమంగా అడవులు కనుమరుగవుతుండడంతోబిక్కుబిక్కుమంటూ బతుకుతున్న మూగ జీవాల పరిస్థితిని అర్థం చేసుకున్న అరవింద్ స్వామివినూత్న ఐడియాతో వాటికి రక్షణ కల్పిస్తున్నారు. మూగజీవాల పరిరక్షణకు ఏకంగా హాండ్స్ టు సర్వీస్ అనేఓ ఎన్జీవోని 2017లో స్థాపించారు. ఈ ఎన్జీఓ ద్వారా రోడ్డుపై ఉన్న మూగ జీవాలకు తానే సొంత ఖర్చులతో వాటికి కావాల్సిన సంరక్షణ చూస్తున్నాడు. అరవింద్ స్వామి న్యూస్ 18తో మాట్లాడుతూ.. నా చిన్ననాటి నుండి తనకి ఇష్టమైన మూగ జీవాలకు సేవ చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు.

దూసుకుపోతున్న వాహనాల కింద పడి జంతువులు కాలు విరగడం చూసాను.. దాన్ని పట్టించుకునేవారు లేరు. అలా ఆ రోజు జరిగిన సంఘటన నన్ను ఎంతో కలిచి వేసింది.ఆ సంఘటన చూశాకేగత 5ఏళ్లుగాకుక్కలు, ఆవులు, గేదెలకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించానని అరవింద్ తెలిపాడు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాతో వాటికి సెంటు భూమి కేటాయించడం చాలా కష్టం. అలాంటిది నోరు లేని జీవాలు ఎలా బ్రతుకుతాయి? వాటికి కూడా ప్రభుత్వం స్పందించి కొంత జాగాను కేటాయిస్తే అవి రోడ్లపై ఉండకుండా అందులోనే జీవించే అవకాశం ఉంటుందని అరవింద్ తెలిపాడు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు