santosh, News18, Peddapalli
ఉన్నత చదువులు చదివి పట్టణాలకు వెళ్లి పలు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు సైతం పొందాడు. కానీ అవేమీ అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. అతనికిపుట్టి పెరిగిన ఊరిపై మమకారం తీరక, సొంతూరులోనే స్వయం ఉపాధి పొందాలన్న ఆలోచనకు వచ్చాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మిన ఆ యువకుడు డెకరేషన్ క్లాత్స్ తయారీని లాభసాటిగా మార్చుకుంటున్నాడు. ఈ రంగంలోనే క్రమంగా అభివృద్ధి చెందుతూ మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువకుని పై ఓ ప్రత్యేక కథనం..
Read Also : Rajanna siricilla: పోడు భూముల విధులు మాకొద్దు.. పంచాయతీ కార్యదర్శుల్లో భయం
యువకుని పేరు సంఘ రాజు పెద్దపల్లి జిల్లా గోదావరికని నివాసుడు, ఈ యువకుడు ఎంబీఏ మార్కెటింగ్వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ టెంట్లు కుడుతు జీవనం గడిపేవారు. పెద్దగా వ్యాపారం లేకపోయినా కుటుంబ పోషణ వరకు సంపాదన ఉండేది. పేదరికంలో కూడా రాజునుచదివించారు. ఎంబీఏపూర్తి చేసిన తర్వాత రాజు హైదరాబాద్లోని పలు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేశాడు.
ఉద్యోగ వచ్చిందన్న సంతోషం తప్ప పెద్దగాఆదాయం లేదు. కనీసం అమ్మానాన్నలకి నెలకి ఒక వెయ్యి రూపాయలు పంపించే పరిస్థితి లేదు. సంతృప్తి లేకపోవడంతో తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు.స్వయం ఉపాధి పొందాలన్న తన ఆలోచననను తల్లిదండ్రులకు తెలిపి వారిని ఒప్పించి చదువుకునే రోజుల్లో నాన్నతో నేర్చుకున్న పని వైపు అడుగులు వేశాడు. అమ్మ నాన్న ఒప్పుకున్నా సరిపడా డబ్బులు లేవన్న బాధలో ఉండగా రాజు స్నేహితులు అండగా నిలిచి ఆర్థిక సాయం చేయడంతో రాజు వ్యాపారం మొదలు పెట్టాడు.
వ్యాపారం మొదట్లో ఎన్నోకష్ట నష్టాలు ఎదుర్కొన్న రాజు కొద్ది రోజులకు కుదుట పడ్డాడు. ఇక రాజు వ్యాపార కొంత లాభదాయకంగా మారడంతోఆదాయం కూడా పెరిగింది. దీంతో సుమారు పదిహేను మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నారు రాజు.
కష్ట పడేవారికి సరైన మార్గం దొరుకుతుంది అనే ఉదాహరణకు నాకు నేను జవాబు. చదువుకునే రోజుల్లో ఇంట్లో గడవాడానికి చాలా కష్టంగా ఉండేదని.. నాన్నతో పాటు నేను కూడా పని చేస్తేనే మూడు పూటలా తినే పరిస్థితి ఉండేదని.. అలాంటి పరిస్థితి నుండి నేను ఈరోజు 15 మంది మహిళలకు ఉపాధి ఇవ్వగలుగుతున్నానని.. దీనికి కారణం నా లోపల ఆలోచనలు.. నా చుట్టూ ఒక ఆరోగ్యకరమైన వాతావరణం. అందుకే నేను యువతి యువలకి ఒకటే చెపుతున్నా.. అనుకున్న గోల్ రీచ్ కావాలంటే కష్టపడాలి.. తీవ్రంగా ప్రయత్నించాలి అలా చేసినప్పుడే మనకు ఎన్నో దారులు దోరుకుతాయని నేటి యువతకు రాజు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana