(E. Santosh, News 18, Peddapalli )వినాయక చవితి (Vinayaka Chaviti) పండుగ వచ్చేసింది. ఊరువాడా అంతా ఏకమై వినాయక విగ్రహం ప్రతిష్టించి ఎంతో భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. ఇక వినాయక పండుగ అనగానే మొదట గుర్తుకొచ్చేది గణేశ్ విగ్రహం (Ganesh Idol). అందంగా ముస్తాబు చేసేందుకు రకరకాల రసాయనాలు వినియోగిస్తున్నారు తయారీదారులు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణ, నీటి కాలుష్యం పెరుగుతున్నందున వీటిని నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతున్నది. రసాయనాలతో (Chemicals) తయారు చేసిన విగ్రహాలపై సుప్రీంకోర్టు సైతం ఆంక్షలు విధించిన నేపథ్యంలో మట్టి వినాయక విగ్రహాల (Clay ganesh idols) వైపు ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతున్నారు. అయితే సమయానికి మట్టి విగ్రహాలు లేకపోవడం కొంత నిరాశకు గురవుతున్నారు.
పెద్దపల్లి (Peddapalli) జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన మహిళ (Woman) చంద్రకళ (Chandra kala) .. గత 15 ఏళ్లుగా మట్టి గణపతులను తయారు చేస్తూ ప్రజలకు మట్టి విగ్రహాల పై, పర్యావరణం పై అవగాహన కల్పిస్తున్నారు. ఏ ఏడాదికాయేడు రసాయన విగ్రహాల నిమజ్జనం పెరిగిపోతుండటం, నీరు కలుషితమవడం వంటివి గమనించిన గోలివాడ చంద్రకళ.. 15 ఏళ్ల క్రితం తాను పర్యావరణంపై (environment) ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు.
పర్యావరణ పరిరక్షణ, కాలుష్యనివారణపై పలు అవగాహన కార్యక్రమాలు చేశారు. అనంతరం వినాయక చవితి పండుగ సమయంలో మట్టితో చేసిన విగ్రహాల వాడకం పై ప్రజల్లో అవగాహన కల్పించారు. మొదట తాను మాత్రమే మట్టి వినాయకులను తయారు చేసి తన చుట్టూ ఉన్న వారికి అవగాహన కల్పించిన చంద్రకళ, పలు స్వచంద సంస్థలు, సింగరేణి సంస్థ నుండి ఆదరణ లభించడంతో ఇంకా మెరుగ్గా తన ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్ళింది.
పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు స్వస్తి పలుకుతూ మట్టి గణపతులనే ప్రతిష్ఠించి పూజించేలా ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన తెచ్చేది. తానే స్వయంగా 'పర్యావరణ హిత' గణపతి విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించింది చంద్రకళ. మహిళా సంఘాలకు, పొదుపు సంఘాల సభ్యులకు, సింగరేణి సంస్థలతో పాటు హైదరాబాద్కు కూడా తాను తయారీ చేసిన మట్టి గణనాథులను పంపిస్తున్నారు చంద్రకళ (Chandra kala).
ఆర్డర్ ఉంది కానీ చేసే వారు లేరు:
కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో వినాయక విగ్రహాలకు పెద్దగా ఆర్డర్ లేదు. కానీ ఈసారి కొంత మేరకు ఆర్డర్ ఎక్కువ వచ్చినా విగ్రహాల తయారీలో సహాయం చేసే వారు లేక ఆర్డర్లు తీసుకోలేదని చంద్రకళ తెలిపారు. మొదట వచ్చిన ఆర్డర్స్ మేరకు తయారు చేశామని, దూర ప్రాంతాల నుండి వచ్చి కొనుగోలు చేసే వారికి ఈసారి విగ్రహాలు దొరకడం కష్టంగా మారిందని అన్నారు. అదే సమయంలో పర్యావరణ హిత వినాయక విగ్రహాల తయారీకి ఖర్చు ఎక్కువై, లాభం తాక్కువైనట్లు వివరించారు. కేవలం పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ మట్టి విగ్రహాలు తయారు చేతున్నామని, దీంతో పని చేసే వారికి కొంత ఉపాధి లభిస్తున్నా తాము లాభాలు ఆశించడం లేదని చంద్రకళ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh Chaturthi 2022, Local News, Peddapalli, WOMAN