హోమ్ /వార్తలు /తెలంగాణ /

Killer Wife: ప్రియుడి కోసం భర్తకు స్కెచ్.. నాలుసార్లు ఫెయిల్.. ఐదోసారి మాత్రం ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే..?

Killer Wife: ప్రియుడి కోసం భర్తకు స్కెచ్.. నాలుసార్లు ఫెయిల్.. ఐదోసారి మాత్రం ఎంతటి దారుణానికి ఒడిగట్టిందంటే..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రియుడి మోజులో పడి భర్తను చంపేందుకు స్కెచ్​ వేసింది. భర్తను చంపేందుకు ప్రియుడికి సహకరించింది. కానీ నాలుగు సార్లు విఫలమైంది. ఇక లాభం లేదని బీహార్‌ వెళ్లి పిస్టోల్‌ కొనుక్కొచ్చి మరి మర్డర్‌ చేశారు..కానీ పోలీసుల ఎంట్రీతో అడ్డంగా దొరికారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

(E. Santosh, News 18, Peddapalli)


ప్రియుడి మోజులో పడి భర్తను చంపేందుకు స్కెచ్​ వేసింది Killer Wife.భర్తను (Husband) చంపేందుకు ప్రియుడికి సహకరించింది. కానీ నాలుగు సార్లు విఫలమైంది. ఇక లాభం లేదని బిహార్‌ (Bihar) వెళ్లి పిస్టోల్‌ కొనుక్కొచ్చి మరి మర్డర్‌ చేశారు. గత కొద్ది రోజుల కిందట తెలుగు రాష్ట్రాలను ఊపేసింది ఈ ఘటన.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా (Peddapalli) చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన రవళి పదో తరగతి వరకు చదువుకుంది. అదే గ్రామానికి చెందిన బంధం రాజుతో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే రవళికి గోదావరిఖనికి చెందిన రాజేందర్‌ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. పెళ్లి అయ్యాక గోదావరిఖని (Godawari Khani)లో గంగనగర్‌లో నివాసం ఉంటుంది. వాళ్ల పండంటి కాపురానికి ఇద్దరు పిల్లలు. అంతా సజావుగా సాగుతున్న క్రమంలో రాజు ఎంట్రీ వాళ్ల జీవితాలను తారుమారుచేసింది.


సోషల్​మీడియా ద్వారా మళ్లీ పరిచయం..


బంధం రాజు ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ప్రస్తుతం కూల్ డ్రింక్ షాప్ మరియు బెల్ట్ షాప్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితo రాజుకు రవళి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మళ్లి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ముదిరి రాజు, రవళిని ఎలాగైనా పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే వాళ్లు పెళ్లి చేసుకోవాలంటే ఆమె భర్తను అడ్డు తప్పించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా రాజేందర్‌ను చంపడానికి బంధం రాజు భార్య (Killer Wife), రాజులు స్కెచ్‌లు వేశారు. రాజేందర్ డ్యూటీ టైమింగ్స్‌ తెలుసుకొని రాజేందర్ నైట్ డ్యూటీ వెళ్లే సమయంలో వెనుక నుండి మృతుని తలపై తన వెంట తెచ్చుకున్న బండరాయితో కొట్టి చంపాలని ప్రయత్నించగా విఫలం అయ్యింది.రెండో సారి.. మృతుని భార్య రవళి తన సొంత ఊరికి వెళ్లిన సమయంలో ఇంట్లో రాజేందర్‌ ఒక్కడే ఉన్నాడని తెలుసుకుని.. రాజు మరో వ్యక్తితో కలిసి గంగనగర్‌లోని మృతుని ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి గేటుకి కరెంటు వచ్చేలా చేశారు. కానీ అది కూడా ఫెయిల్‌ అయ్యింది.


మూడో ప్రయత్నంగా… మరోసారి రాజేందర్ డ్యూటీకి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు అడ్డగించి బైక్‌పై నుంచి కిందపడేసి..రాడ్డుతో తలపగలకొట్టి చంపాలని (Murder) ప్లాన్ చేసుకున్నారు. బంధం రాజు తన ముగ్గురు స్నేహితులైన సయ్యద్ గులాం, వాజిద్, ఇమ్రాన్‌లతో కలిసి రాజేందర్‌ను వెంబడించారు. కానీ జనాలు ఎక్కువగా తిరుగుతుండటంతో ఆ ప్లాన్‌ కూడా విఫలం అయ్యింది.


Hyderabad to Karachi flight: హైదరాబాద్ నుంచి కరాచీ వెళ్లిన ఫ్లైట్​లో ఎవరున్నారు? అధికారులు ఏమంటున్నారు?


నాలుగోసారి… రాజేందర్‌ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఇందారం ఫారెస్ట్ చెక్ పోస్ట్ ప్రాంతంలో కారుతో మృతుడు రాజేందర్ బైక్‌ను ఢీకొట్టారు. కానీ, చిన్న చిన్న గాయాలతో రాజేందర్ బయటపడ్డాడు.


ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజేందర్‌ బయటపడుతుండటంతో  విచక్షణ కోల్పోయిన రాజు మరో పథకం కోసం సిద్ధం అవుతున్నాడు. ఆ సమయంలో బంధం రాజు నడుపుతున్న బెల్ట్ షాప్ వద్దకి.. జాడి @నీలాల శీను అనే వ్యక్తి వచ్చి పిస్టల్ గురించి మాట్లాడటంతో..తనకు ఒక పిస్టల్ కావాలని కోరాడు. బిహార్‌కి వెళ్తే.. అక్కడ రూ. 1,50,000కి పిస్టల్ ఇప్పిస్తానని చెప్పి రాజును శ్రీను బీహార్‌కి తీసుకెళ్లాడు. పిస్టోల్ కొనుగోలు చేశారు, అలా బీహార్‌ వెళ్లి గన్‌ కొనుక్కొచ్చాక కూడా రెండు సార్లు ఫెయిల్‌ అయ్యాడు. ఇలా లాభం లేదని ఒక రోజు రాత్రి పథకం ప్రకారం.. బంధం రాజు తన మిత్రుడు అయిన గులాం సయ్యద్‌ను పల్సర్ బైక్ పై ఎక్కించుకొని నేరుగా గోదావరిఖనిలోని రవళి ఇంటికి వెళ్లాడు.


రవళిని తలుపు తీయమని మధ్య రాత్రి 02:00 గంటలకు ఇంటిలోకి వెళ్ళి బెడ్‌పైన పడుకొని ఉన్న రాజేందర్‌ను… బందం రాజు తన వెంట తెచ్చుకున్న తుపాకితో రెండు రౌండ్‌లు అతని కణతపైన కాల్చాడు. దీంతో రాజేందర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. రాజు, సయ్యద్‌ అక్కడ నుంచి పారిపోయారు.


ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్న గోదావరిఖని పోలీసులు చాకచక్యంగా నిందితులను అతి తక్కువ సమయంలో పట్టుకున్నారు. నిందితులు బంధం రాజు, అతనికి సహకరించిన సయ్యద్‌ గులాం, మృతుడు రాజేందర్‌ భార్య రవళిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి తుపాకి మరియు తుటాలు స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ బాబు, రాజ్ కుమార్ గౌడ్‌లు తెలిపారు.

First published:

Tags: Attempt to murder, Crime news, Local News, Peddapalli, Wife kills husband

ఉత్తమ కథలు