Home /News /telangana /

PEDDAPALLI A WARNING TO FAST FOOD EATERS IN PEDDAPALLI YOU MUST KNOW THESE THINGS PSE BRV PRV

Peddapalli: ఫాస్ట్​ఫుడ్ తింటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

ఫాస్ట్​ఫుడ్​

ఫాస్ట్​ఫుడ్​

విదేశీ వంటకాలు ఇక్కడి ప్రజలను ఊరిస్తుండగా, శుభ్రత, నాణ్యత విషయాల్లో అక్కడ పాటిస్తున్న కఠిన నిబంధనలు మాత్రం ఇక్కడ పాటించరు. ఈనేపధ్యంలో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India
    (E.Santosh, News 18, Peddapalli)

    గ్లోబలైజేషన్ పుణ్యమా అంటూ విదేశీ సంస్కృతులను అలవాటు చేసుకుంటున్నారు ప్రజలు. అందులో భాగంగా మొదటగా ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటున్నారు. విదేశీ వంటకాలు ఇక్కడి ప్రజలను ఊరిస్తుండగా, శుభ్రత, నాణ్యత విషయాల్లో అక్కడ పాటిస్తున్న కఠిన నిబంధనలు మాత్రం ఇక్కడ పాటించరు. ఈనేపథ్యంలో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు.

    పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫాస్ట్‌ఫుడ్ పాయింట్స్:

    పెద్దపల్లి జిల్లా (Peddapalli) గోదావరిఖని ఏరియాలో ఇటీవల కాలంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు అనేకం పుట్టుకొచ్చాయి. వీధికొక నూడుల్స్ పాయింట్, కాలనీకొక టిఫిన్ సెంటర్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. తక్కువ సమయంలో తయారై, రుచిగా కూడా ఉంటుండడంతో యువత ఎక్కువగా ఈ ఫాస్ట్‌ఫుడ్‌ (Fast-food)ని ఇష్టంగా తింటున్నారు. దీంతో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఎంత మేర నిబంధనలు పాటిస్తున్నాయి?, ఫుడ్ సేఫ్టీ  (Food Safety)అధికారులు ఎంతవరకు తనిఖీలు (Checking's) చేస్తున్నారు? అనే విషయాలు అంతుబట్టడంలేదు. ఎవరి ఇష్టం వారిదే ఎవరి బిజినెస్స్ వారిదే. మరి ప్రజల ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకునేది?. నిబంధనలకు అతిక్రమించి వెలుస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఫుడ్ తింటే ఒంటికి మంచిదేనా అంటే…! అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



    ఇటీవలి కాలంలో ఫాస్ట్‌ఫుడ్‌గా ఎక్కువగా నూడుల్స్‌ తింటున్నారు. కొంతమంది వీటిని అల్పాహారంగానూ, భోజనంగానూ తింటున్నారు. సాధారణంగా మానవ శరీర క్రియలు సక్రమంగా సాగడానికి ఆ మూడు భోజన సమయాల్లో తినే ఆహారం (Food) చాలా ప్రభావం చూపిస్తుంది. అటువంటి సమయంలో నూడుల్స్, బర్గర్స్ వంటి జంక్ ఫుడ్ తినడం సరైన పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి కావాల్సిన పోషకాలు వీటిలో అంతగా ఉండవు కాబట్టి...ఇన్స్టంట్ ఫుడ్ తరచుగా తినడం వల్ల శరీరంపై దుష్ప్రభావాలు పడతాయని నిపుణులు అంటున్నారు. నూడుల్స్ తరచుగా తినడం వల్ల శరీరంలో అధికంగా సోడియం చేరి, నీరు నిలిచిపోవడం వంటివి జరిగి బరువు త్వరగా పెరుగుతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయా?

    విదేశాల్లోప్రజలు సాధారణంగా పిజ్జా, బర్గర్, నూడుల్స్, ఫ్రైడ్ చికెన్ వంటి ఫాస్ట్ ఫుడ్ తింటారు. అయినా వారికి పెద్దగా ఆరోగ్య సమస్యలుఉండవు. కానీ మన దేశంలో ఇలా తరచూ ఫాస్ట్ ఫుడ్ తినేవారిలో పేగు సంబంధిత వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆహారంలో నాణ్యత పాటించకపోవడమే. బర్గర్, పిజ్జా వంటి వంటకాల తయారీకి అక్కడి ప్రభుత్వాలు సూచించిన నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ, నాణ్యమైన ముడిపదార్ధాలు వాడుతారు. ఈక్రమంలో ఆయా పదార్ధాల్లో ఉండే పోషకాలు పాడవకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పచ్చి ఆకుకూరలు, ఉడికించిన మాంసం, ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకుంటూ ఆహార సమతుల్యతను పాటిస్తుంటారు. తినే తిండికనుగుణంగా వ్యాయామాలూ చేస్తుంటారు. ఇక మన దేశంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తయారయ్యే ఆహార పదార్ధాల్లో ఈ నియమనిబంధనలు విస్మరిస్తున్నారనేది జగమెరిగిన సత్యం.

    తనిఖీలు కరువు..

    పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఫాస్ట్‌ఫుడ్ పాయింట్లు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నా వాటిని పర్యవేక్షించే ప్రభుత్వ అధికారులు మాత్రం లేరని స్పష్టంగా కనిపిస్తుంది. నిత్యం ఆహార తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు విస్మరిస్తున్నారు. దీనికీ కారణం లేకపోలేదు. ఫుడ్ సెంటర్ ఏర్పాటు సమయంలో నిర్వాహకులు ఇచ్చే తప్పుడు అడ్రస్ ఒక కారణం అయితే, చిన్నాచితకా సందుల్లోనూ ఉన్న ఫుడ్ సెంటర్ గుర్తించడం అధికారులకు వచ్చిపడ్డ తిప్పలు. మరోవైపు ఫుడ్స్ ఇన్స్పెక్టర్లకు కొద్ది మొత్తంలో తాయిలాలు అందుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రజా ఆరోగ్యం పై పట్టింపు లేకుండా ఇష్టానుసారంగా నాణ్యత పాటించకుండా ఫుడ్ కోర్టులు నడిపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Food, Health care, Local News, Peddapalli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు