Home /News /telangana /

PEDDAPALLI A MAN STOLE GOLD FROM HIS OWN BROTHERS HOUSE IN MANCHERIAL TELANGANA FULL DETAILS HERE PRN PSE BRV

Peddapalli: అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు.., చివరికి ఇలా పోలీసులకు చిక్కాడు

మంచిర్యాలలో అన్న ఇంటిని దోచేసిన తమ్ముడు

మంచిర్యాలలో అన్న ఇంటిని దోచేసిన తమ్ముడు

Shocking: తండ్రి ఆస్తిగా ఇచ్చిన ఇంటిని అన్న అనుభవిస్తున్నాడనే అక్కసుతో ఓ తమ్ముడు సొంత అన్న ఇంటికే కన్నం వేశాడు. ఇంటిలో ఉన్న బంగారం మొత్తం ఊడ్చేసి అన్నకు నష్టం కలిగించాలని భావించి చివరకు కటకటాల పాలయ్యాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India
    E. Santosh, News18, Peddapalli తండ్రి ఆస్తిగా ఇచ్చిన ఇంటిని అన్న అనుభవిస్తున్నాడనే అక్కసుతో ఓ తమ్ముడు సొంత అన్న ఇంటికే కన్నం వేశాడు. ఇంటిలో ఉన్న బంగారం మొత్తం ఊడ్చేసి అన్నకు నష్టం కలిగించాలని భావించి చివరకు కటకటాల పాలయ్యాడు. మంచిర్యాల జిల్లా (Manchiryal District) పోలీసులు కథనం మేరకు.. మంచిర్యాల పట్టణంకు చెందిన మలిపొర ప్రసన్న చారి డిప్లొమా పూర్తి చేసి మెకానిక్‌గా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా వుండటంతో పాటు జల్సాలకు అలవాటు పడ్డాడు. ప్రసన్న చారి సోదరుడు శ్రీనివాస్ దుబాయ్‌ (Dubai) లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తమ తండ్రి కట్టించిన ఇంట్లో అన్న శ్రీనివాస్ ఒక్కడే ఉంటూ.. తల్లిదండ్రులను, తనను పట్టించుకోవడం లేదని అన్నపై కోపం పెంచుకున్నాడు ప్రసన్నచారి. ఈక్రమంలో తన వదిన దివ్య ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్లగా.. ఇదే అదునుగా భావించిన ప్రసన్న చారి.. ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 26 తులాల బంగారాన్ని కాజేశాడు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.చంద్ర శేఖర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు, మంచిర్యాల ఇంచార్జి డీసీపీ శ్రీ. అఖిల్ మహాజన్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ నారాయణ ఆద్వర్యంలో పోలీసులు బుధవారం ముఖరామ్ చౌరస్తాలో గస్తీ ఏర్పాటు చేశారు.

    ఇది చదవండి: పార్కింగ్‌లో ఉంచిన బైక్‌లే టార్గెట్., పోలీసులకు అలా దొరికిపోయాడు

    ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రసన్నను పోలీసులు అడ్డగించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులను చూసి ప్రసన్న తప్పించుకోని పారిపోవటానికి ప్రయత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. 26 తులాల బంగారు, వెండి ఆభరణాలను బంగారం షాపులో అమ్మెందుకు తీసుకెళ్తున్నానని ప్రసన్న పోలీసులకు వివరించాడు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.10,40,000 విలువ గల బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వరంగల్ జిల్లా (Warangal) లో ఇలాంటి దొంగతనాలే తరచూ జరుగుతున్నాయి. కాజీపేట కేంద్రానికి చెందిన యోగి ఒక ప్రైవేట్ మిల్క్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నాడు. రోజు దర్గాబంధం చెరువు వద్ద తన పల్సర్ బైక్‌ని పార్క్ చేసి విధులకు వెళ్తుంటాడు. అదేవిధంగా ఈనెల 17వ తారీఖున ఎప్పటిలాగే యోగి రోజు తన బైక్‌ను పార్కింగ్‌లో పెట్టి డ్యూటీకి వెళ్ళిపోయాడు. విధులు నిర్వహించుకొని సాయంత్రం బైక్ కోసం వచ్చిన యోగికి అక్కడ బైక్ కనిపించలేదు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Local News, Manchiryala, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు