E.Santosh, News18, Peddapalli
సాంప్రదాయ, వాణిజ్య పంట సాగులో నష్ట పోతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు ఉంటాయని నిరూపిస్తున్నాడు ఈ యువ రైతు. తనకున్న కొద్ది పాటి పొలంలోనే కూరగాయలు సాగు చేస్తూ లాభాలు తెచ్చుకుంటున్న ఈ యువ రైతు ఇరుగుపొరుగు వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. సీజన్ వారీగా కూరగాయలు సాగు చేస్తూ, ఆ కూరగాయలను తానే నేరుగా మార్కెట్లో అమ్ముతూ ఎక్కువగా లాభాలు పొందుతున్నాడు. తెలంగాణ (Telangana)లోని పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గొల్లపల్లికి చెందిన యువ రైతు మల్లేష్ యాదవ్ కూరగాయల సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. తనకున్న కొద్దిపాటి పొలంలోనే తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి వచ్చే కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నాడు. అంతే కాదు మల్లేష్ యాదవ్ కుటుంబం మొత్తం ఈ కూరగాయల సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
ఈ సందర్భంగా మల్లేష్ న్యూస్ 18తో మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబంలో పుట్టిపెరిగిన తాను చిన్నప్పటి నుండి తండ్రితో పాటు వ్యవసాయం చేయడం నేర్చుకున్నానని తెలిపారు. తండ్రితో కలిసి రోజు పొలం పని చేస్తున్నా అప్పట్లో లాభాలు వచ్చేవి కావని వివరించాడు. పెట్టిన పెట్టుబడికి దిగుబడి రాక చాలా కష్టాలు ఎదురుకున్నామని మల్లేష్ తెలిపాడు. అదే సమయంలో ప్రత్యామ్న్యాయ పంటలపై దృష్టిపెట్టి సీజన్ వారీగా కూరగాయల సాగు ప్రారంభించాడు.
ఎండకాలంలో పుచ్చకాయ, దోస, వంటి పంటలు పండించిన మల్లేష్ వాటిని నేరుగా మార్కెట్ లో అమ్మడంతోలాభాలు వచ్చినట్లు తెలిపాడు. ఇలా చేస్తూ కొంత పొలం కూడా కొనుగోలు చేశాడు. కూరగాయల సాగులో మంచి లాభాలు వస్తుండడంతో కుటుంబం అంతా కలిసి కూరగాయల సాగు చేస్తున్నట్లు తెలిపారు.
రైతుకు ప్రతి రోజూ ఆదాయాన్నిచ్చే పంటలు కూరగాయలు. ప్రణాళికాబద్ధంగా సీజన్ వారీగా వివిధ రకాల కూరగాయ పంటలను పండించొచ్చు. అన్ని సీజన్లలోనూ పండే కూరగాయలు సాగు చేయడంతో చేతి నిండా పని కూడా ఉంటుంది. రైతు మల్లేష్‌కు ఉన్నది కేవలం 25 గుంటల స్థలం. అందులోనే కాకర, అలసంద, భీర, అలాగే టమాటో,వంకాయ,గుత్తి వంకాయ,సొర కాయ,చిక్కుడు కాయ సాగు చేస్తున్నాడు. మరో ఎకరా భూమిలో వరి సాగు చేస్తున్నాడు. ఒక్కసారి పంట సాగు చేస్తే 45 రోజులకు చేతికి వస్తుంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే మూడు దఫాలు కూరగాయలు పొందవచ్చు. అంటే రూ. లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతు మల్లేష్ వివరించాడు. 6301723208, మల్లేష్, వెజిటబుల్ ఫార్మ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Local News, Telangana