హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapelli: బయట నుండి చూస్తే కంటైనర్.. డోర్ తీస్తే లోపల లగ్జరీ ఇల్లు

Peddapelli: బయట నుండి చూస్తే కంటైనర్.. డోర్ తీస్తే లోపల లగ్జరీ ఇల్లు

లగ్జరీ ఇల్లు

లగ్జరీ ఇల్లు

Telangana: ఇది కంటైనర్ అనుకుంటున్నారా కాదు లక్సరి ఇల్లు లోపల చూస్తే షాక్ అవల్సిందే సొంతిళ్లు కలిగి ఉండాలనేది చాలా మంది కోరిక. అయితే కోవిడ్ సంక్షోభం తర్వాత మారిన పరిస్థితిల్లో ఇంటి నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరిగింది. స్టీలు, సిమెంటు మొదలు అన్ని రకాలైన బిల్డింగ్ మెటీరియల్ ధరలు పెరిగిపోయాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

santosh, News18, Peddapalli

ఇది కంటైనర్ అనుకుంటున్నారా కాదు లక్సరి ఇల్లు లోపల చూస్తే షాక్ అవల్సిందే సొంతిళ్లు కలిగి ఉండాలనేది చాలా మంది కోరిక. అయితే కోవిడ్ సంక్షోభం తర్వాత మారిన పరిస్థితిల్లో ఇంటి నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరిగింది. స్టీలు, సిమెంటు మొదలు అన్ని రకాలైన బిల్డింగ్ మెటీరియల్ ధరలు పెరిగిపోయాయి. ఈ రోజుల్లో ఇల్లు కట్టడమంటే ఓ సాహసమనే చెప్పాలి. ఓ ఇల్లు నిర్మించాలంటే.. సుమారు రూ 20 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల స్థోమతకు అనుకూలంగా వచ్చినవే.. ఈ కంటైనర్ ఇళ్లు. రూ.3లక్షలకే ఇల్లు పూర్తవుతుండటంతో.. ప్రజలు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. పట్టణ ప్రజలే కాకుండా.. పల్లెల్లోనూ, గ్రామీణులు వీటిని కొనేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో కంటైనర్ ఇళ్లు తయారు చేసే కంపెనీలకు పోటీ పెరిగిపోయింది. దీంతో తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం ఎలా అంశంపై చాలా మంది దృష్టి సారించారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో నర్సయ్య పల్లెకు చెందినదామోదర రావు తన పొలంలో కంటైనర్ ఇల్లును తయరు చేసుకుని నివాసం ఉంటున్నాడు. కంటైనర్ లోపల అన్ని రకాల వసతులు కలిగి ఉన్నాయి. దామోదర రావు తన కంటైనర్ ఇంట్లో సింగిల్ బెడ్ రూం అటాచ్ బాత్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో టీవీ, ఫ్రిడ్జ్, బెడ్ వంట గది అన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నారు. మెట్రో నగరాలు, పట్టణాలకే పరిమితమైన కంటైనర్ ఇళ్లకు నేడు పల్లెల్లోనూ ఆదరణ పెరుగుతోంది. నిర్మాణ వ్యయం బాగా తక్కువగా ఉండటం. ఎక్కడికైనా మార్చుకునే వీలుండటం వల్ల ప్రజలు వీటివైపు మొగ్గు చూపుతున్నారు.

మామూలుగా ఇంటి నిర్మాణానికి.. రూ.15లక్షల దాకా అవుతుండగా.. అన్ని సౌకర్యాలతో కంటైనర్ ఏర్పాటుకు రూ.3లక్షలే అవుతోంది. పెద్దపల్లి జిల్లాలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు.. వీటిపై కంపెనీలు వివిధ ఆఫర్లు అందిస్తున్నారట. కంటైనర్ ఇల్లుతో అనేక లాభాలు... కంటైనర్ ఇల్లును మనకు అనుకునంగా ప్లాన్ చేసుకొని నిర్మించుకోవచ్చు. సింగిల్ బెడ్ రూమ్ డబుల్ బెడ్ రూంతో పాటు ఎలక్ట్రికల్ సదుపాయం అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. మనకు ఎలా కావాలంటే అలాగా తయారు చేసి ఇస్తారు సంబంధిత కంపెనీ వారు. అంతే కాకుండా ఈ ఇల్లును మనకు ఏక్కడ కావాలంటే అక్కడకి మార్చుకోవచ్చు. బయట నుండి కంటైనర్ లా కనిపించిన లోపలకి వెళ్లి చూస్తే మాత్రం లక్సరీగా ఉంటుంది.

First published:

Tags: Local News, Mulugu, Telangana

ఉత్తమ కథలు