Santosh, News18, Peddapalli
ఆడపిల్ల పుట్టిందని ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు. మహాలక్ష్మీ తన ఇంట్లో అడుగుపెట్టిందని ఆనందించారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలంగా ఆ తల్లిదండ్రులతోలేదు. ఆ చిన్నారితో 2 ఏళ్ళలోనే వారి కుటుంబలో అల్లకోల్లోలం నెలకొంది. సాత్విక అనే రెండేళ్ల చిన్నారి అప్పటి వరకు అమ్మ నాన్నలతో కలిసి బుడి బుడి అడుగులేస్తూ బుల్లి బుల్లి మాటలతో అలరించింది. సాత్విక అల్లరితో ఇంట్లో నడియాడుతుంటే ఆ ఇంటికే కల వచ్చేది. ఇప్పుడు ఆ ఇంట్లో సందడి కనిపించడం లేదు. ఎందుకు అంటే ఆ అల్లరి ఇప్పుడు బెడ్డుకు అంకితం అయింది.బ్రెయిన్ ట్యూమర్ రూపంలోసాత్విక జీవితాన్ని వారి తల్లి తండ్రుల సంతోషాలను చిన్నాభిన్నం చేసింది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జనగామ గ్రామానికి చెందిన గడ్డం శ్రావణి మల్లేష్ దంపతుల ఏకైక కుమార్తె సాత్విక. చిన్నారి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. అలాగే మాటను కూడా కోల్పోయింది. రెండేళ్ల వయసులోనే విపరీతమైన జ్వరంవచ్చిందని, విష జ్వరం కావడంతో కోమాలోకి వెళ్లిందని సాత్విక తల్లి అవేదన చెందింది. ఆసుపత్రికి తీసుకెళ్లి ఎంఆర్ఐ స్కాన్ తీస్తే పాపకు ఉన్న సమస్య తెలుస్తుందని చెప్పారు. డాక్టర్ సూచన మేరకుస్కాన్ తీస్తేషాకిచ్చే వార్త చెప్పారు డాక్టర్లు. సాత్విక బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుంది అని చెప్పారు.
తన చిన్నారి ఎంతో బాధకు గురవుతోందని అయినప్పటికీ ఇంతకాలం వరకు భరించిందని చెప్పుకుంటూ కన్నీరు మున్నీరైంది తల్లి శ్రావణి. తాను డ్యాన్స్ చేస్తే చూసేందుకు రెండు కళ్లు చాలవని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు మంచానికే పరిమితమైన తన కూతురును ఈ స్థితిలో చూడలేక ఉన్నానంటూ భోరున విలపించింది శ్రావణి. ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. సాత్వికకి ముక్కు నుండి శ్వాశ తీసుకోవడం ఇబ్బందిగా ఉందని గొంతులో హోల్స్ చేసి శ్వాశ అందిస్తున్నారు. ఆ తర్వాత ఆమె నెలరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంది. ఇక ఇదే సర్జరీ ఆమెలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. మాట లేదు.. గొంతు లేదు.. ఏడ్చినా చప్పుడు రాదు.. ఆకలి ఉండదు.. టైం చూసి పైప్ ద్వారా పాలు మరియు కొన్ని ద్రవ పదార్థాలు పోస్తున్నారు.
PM Modi : దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడు నిర్వహించని మెగా రోడ్ షో చేసిన మోదీ
ఇంత చిన్న వయస్సులో, అంత బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు సాత్వికకి ఇచ్చాడన్న బాధ ఎవరికైనా కన్నీరు పెట్టిస్తుంది. నోరు తెరచి తమతో చెప్పనప్పటికీ లోపల ఆ బిడ్డ చెందుతున్న ఆవేదన తన కళ్లలో తెలుస్తోందంటూ తల్లి దండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇక చిన్నారి సాత్విక కోలుకుని సాధారణ స్థితికి చేరుకునేందుకు చాలా కాలం పడుతుంది. సాత్విక తండ్రి కులి పని చేస్తాడు రెక్కాడితే డొక్క ఆడని కుటుంబం వాళ్ళది. ఇప్పటికీ అప్పు చేసి ఆసుపత్రిలో చూపిస్తున్న వారికి చిన్నారి చికిత్సకుఆర్థిక సాయం కావాలని వేడుకుంటున్నారు.
సాత్వికకు పునర్జన్మను ప్రసాదించాలని.. వారి తల్లి దండ్రుల బాధను తీర్చాలని న్యూస్ 18 ప్రత్యేక కథనంతో ప్రజలకు చేరవేస్తుంది. సంప్రదించాల్సిన నెంబర్లు.. 8074390756 శ్రావణి సాత్విక తల్లి, 81793 85410 మల్లేష్ సాత్విక తండ్రి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana