PEDDAPALLI A 38 YEAR OLD MAN RAPED AN 11 YEAR OLD GIRL IN PEDDAPALLI AFTER HE CALLED HER HOME TO PUT RICE KNR PRV
Crime news: 11 ఏళ్ల బాలికపై 38 ఏళ్ల వ్యక్తి దారుణం.. అన్నం పెడుతానని ఇంట్లోకి పిలిచి.. ఆ తర్వాత..
నిందితుడు
ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చిన అవేమి పట్టనంటూ.. మూర్ఖుల ప్రవర్తిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చిన అవేమి పట్టనంటూ.. మూర్ఖుల ప్రవర్తిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిని ' అన్నం పెడతానంటూ ఇంట్లోకి పిలిచిన ఓ కామాంధుడు అత్యాచారానికి (Attempted rape) పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లిలో గురువారం చోటుచేసుకుంది . పొత్కపల్లి పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్ (Karimnagar) జిల్లా ఇల్లందకుంటకు చెందిన బాలిక ( 11 ) వేసవి సెలవుల నేపథ్యంలో పది రోజుల కిందట ఉప్పరపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది గురువారం ఉదయం కుటుంబ సభ్యులు ఉపాధి హామీ పనులు చేయడానికి వెళ్లారు. చిన్నారి ఇరుగుపొరుగు పిల్లలతో కలిసి బయట ఆడుకుంటుండగా గ్రామానికి చెందిన శిలారపు రమేశ్ ( 38 ) ' అన్నం తిందాం రా ' అంటూ పిలవడంతో వెళ్లింది .
అస్వస్థతకు గురైన బాలిక..
మధ్యాహ్నం అమ్మమ్మ ఇంటికి వచ్చిన తర్వాత చిన్నారికి రక్త స్రావం కావడం గమనించి ఆరా తీయడంతో అఘాయిత్యం వెలుగుచూసింది. స్థానికులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు. అస్వస్థతకు గురైన బాలికను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎస్.లక్ష్మణ్ తెలిపారు. నిందితుడు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకొని కఠిన శిక్షిస్తామని తెలిపారు.
12 ఏళ్ల బాలికపై..
గతంలో నిజామాబాద్లో (Nizamabad) ఇలాంటి ఘటనే జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒకటో టౌన్ పరిధిలోని నివాసముంటున్న ఆటో డ్రైవర్ మజీద్, అక్కడే నివాసం ఉంటున్న 12 ఏళ్ళ బాలిక పై కన్నేశాడు. ఓ రోజు వాళ్ల ఇంట్లో ఎవరూ లేని చూసి.. అతడు ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇలా ఆ బాలికను బెదిరించి గత కొంత కాలంగా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపుతానని బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే ఇటీవల ఆ బాలికపై అనుమానం వచ్చినా తల్లి నిజం చెప్పుమని మందలించింది. దీంతో ఆ బాలిక అసలు విషయం చెపింది.. విషయం తెలిసిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మానవ మృగాలు వావి వారసలు మరిచి.. చిన్న పెద్ద తేడాలేకుండా రెచ్చి పోతున్నారు.. మరీ దారుణంగా మైనర్ బాలికలపై అత్చాచారాలకు పాల్పడుతున్నారు. ఎంతటి కఠిన చట్టాలు తీసుకువచ్చినా మానవా మృగాలు ఏ మాత్రం మారడం లేదు. యువత మత్తుకు బానిసలు కావడం తో ఇలాంటి ఘటనలు జరుగు తున్నాయి. యూత్ విషయంలో పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలిసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఇలాంటి అఘాయిత్యాలు తగ్గుతాయని స్థానికులు కోరుతున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.