హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: రెండు ఎకరాల్లో 300 రకాల వరి సాగు: దేశవాళీ వరి సాగును బ్రతికిస్తున్న రైతు 

Peddapalli: రెండు ఎకరాల్లో 300 రకాల వరి సాగు: దేశవాళీ వరి సాగును బ్రతికిస్తున్న రైతు 

X
వరిసాగు

వరిసాగు చేస్తున్న రైతు

Peddapalli: మాములుగా ఒకరకం వరి పంట పండించాలంటేనే ఈరోజుల్లో రైతులు ఎంతో శ్రమించాల్సి వస్తుంది. అటువంటిది పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు ఏకంగా 300 రకాల వరిని పండిస్తున్నాడు. తనకున్న రెండెకరాల పొలంలోనే రైతు ఈ 300 రకాల వరిని పండించడం విశేషం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

E.Santosh, News18, Peddapalli

మాములుగా ఒకరకం వరి పంట పండించాలంటేనే ఈరోజుల్లో రైతులు ఎంతో శ్రమించాల్సి వస్తుంది. అటువంటిది పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు ఏకంగా 300 రకాల వరిని పండిస్తున్నాడు. వాటిలో కొన్ని కనుమరుగవుతున్న వరి రకాలు ఉండగా, మరికొన్ని సాంప్రదాయ రకాలు కూడా ఉన్నాయి. తనకున్న రెండెకరాల పొలంలోనే రైతు ఈ 300 రకాల వరిని పండించడం విశేషం. పెద్దపల్లి జిల్లా కల్వచేర్లకు చెందిన రైతు యాదగిరి శ్రీనివాస్ వరిసాగుకు కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. మన పంట మన ఆరోగ్యం, జీవ వైవిధ్యంలో దేశీ వరికి సంబంధించి 300 రకాలను సాగు చేస్తున్నాడు యాదగిరి శ్రీనివాస్. మొదట 5 రకాల వరి మాత్రమే సాగు చేసిన శ్రీనివాస్ ఇప్పుడు 300 వందల రకాల వరి సాగు చేస్తున్నాడు. వచ్చే ఏడాది 500 రకాల వరి సాగు చేస్తానని రైతు శ్రీనివాస్ న్యూస్ 18 చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం రసాయన పద్దతుల్లో పండిస్తున్న అనేక రకాల వరి సాగు కారణంగా మన దేశీ పంట కనుమరుగవుతుంది. ఎక్కడో ఒక చోట ఒకరిద్దరు మాత్రమే దేశవాళీ పంట సాగు చేస్తున్నారు. నిజానికి దేశీ వరిలో అనేక రకాలు ఉన్నా ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని మాత్రమే సాగులో ఉన్నవి. అలా అందుబాటులో ఉన్న వరి రకాలను బ్రతికించేలా రైతు శ్రీనివాస్ కృషి చేస్తున్నాడు. మొత్తం 2 ఎకరాలలో 300 రకాల వరి సాగు చేస్తుండగా, రూ. 20 వేలు పెట్టుబడి అవుతుందని, రాబడి రూ. 70 వేల వరకు వస్తుందని రైతు చెప్పుకొచ్చాడు. సేంద్రియ పద్దతిలో సాగు చేస్తున్నందున ఖర్చులు తగ్గించుకుని రాబడి పెంచుకోవాలని రైతు సూచిస్తున్నాడు.

సేంద్రియ ఎరువులతోనే మొత్తం సాగు:

జీవామృతాన్ని సహజమైన ఎరువుగా చెప్పవచ్చు. ఇది ద్రవ రూపంలోను, ఘన రూపంలోను రైతులు నేరుగా తయారుచేసుకోవచ్చు. దేశీ ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లంనల్ల బెల్లం,శనగ, ఉలవ, పెసర, మినుము పప్పుల పిండి, నీరు, పాటి మట్టిపొలం గట్టు మన్ను దోసెడు సేకరించి పెట్టుకోవాలి. ఒక తొట్టెలో గానీ డ్రమ్ములోగానీ నీటిలో ఈ పదార్ధాల్నింటినీ కలిపి 48 గంటలపాటూ నీడలో ఉంచాలి. ప్రతి రోజు రెండు మూడు సార్లు కర్రతో కుడివైపునకు తిప్పాలి. ఇలా తయారైన జీవామృతాన్ని 2 రోజుల అనంతరం వారంలోగా వాడేయాలి. పంటకు నీరు పెట్టె సమయంలో నీటితో కలిపి పొలం మొత్తానికి జీవామృతం అందేలా కూడా చేయవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే చాలు. వరి మొక్కలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుందని రైతు శ్రీనివాస్ వివరించాడు.

First published:

Tags: Local News, Peddapalli, Telangana

ఉత్తమ కథలు