వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని దేవిలాల్ తండా శివారులో అనుమానాస్పదంగా ఎనిమిది నెమళ్లు మృతి చెందాయి.. కాగా ఈ సమాచారం అందుకున్న వర్దన్నపేట అటవీ అధికారి సదానందం సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.. కాగా మృతి చెందిన నెమళ్లకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌కు తరలించినట్లు తెలిపారు. వీటి మృతికి వ్యవసాయ పొలాలకు వాడే పురుగు మందు లేదా ప్రస్తుతం వ్యాపించే బర్డ్ ఫ్ల్యూ వ్యాధి కావొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే, నెమళ్ల మృతికిపై పోస్టుమార్టం తర్వాతే స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. దీంతో పాటు ఎవరైనా కావాలనే చంపారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.