Jana sena - Glass symbol: ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి అనుకోని సమస్య ఒకటి తలెత్తింది. తెలంగాణ రాష్ట్రంలో ఐదు మున్సిపాల్టీలు, రెండు కార్పొరేషన్లకు త్వరలో జరిగే ఎన్నికల పోటీలో... జనసేన తన గుర్తు అయిన గాజు గ్లాసును కోల్పోయింది. ఈ పార్టీతోపాటూ... ఇండియన్ ప్రజా పార్టీ తన ఈల గుర్తునూ... ప్రజాబంధు పార్టీ... ట్రంపెట్ గుర్తునూ... ఎంసీపీఐ (యూ)... గ్యాస్ సిలిండర్ గుర్తునూ.... హిందుస్థాన్ జనతా పార్టీ... కొబ్బరి తోట గుర్తునూ... కోల్పోయాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన GHMC ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లకు కూడా పోటీచేయని కారణంగా ఈ పార్టీలు కామన్ గుర్తులను కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు.
మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా... జనసేన మాత్రం ఇది తమకు తీరని నష్టంగా భావిస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే GHMC ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా పోటీ నుంచి జనసేన తప్పుకుంది. అప్పట్లో ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం (S EC)కి లేఖ రూపంలో తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దాని ప్రభావం ఇప్పుడు పడుతుందని ఆ పార్టీ ఊహించలేదు. త్వరలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల్లో పోటీచేయాలని జనసేన భావిస్తోంది. అందుకే... తమ అభ్యర్థులకు 'గాజుగ్లాసు' కామన్ సింబల్‌గా కొనసాగించాలని ఎస్ఈసీని జనసేన కోరింది. కానీ అనుకున్నట్లు జరగట్లేదు.
జనసేన ఇచ్చిన వినతిపత్రంలో అంశాలు సంతృప్తికరంగా లేవని SEC చెబుతోంది. అందుకే ఈ వినతిని ఒప్పుకోవట్లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. జనసేన సహా ఇతరపార్టీలు 2025 నవంబర్ 18 వరకు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Homeo Vaccine: కరోనాకు హోమియో వ్యాక్సిన్... ఎంత ప్రభావం చూపిస్తోంది? నిలకడగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం:
కరోనా బారిన పడిన పవన్‌కల్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ దగ్గర్లోని తన వ్యవసాయక్షేత్రంలో డాక్టర్ల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నారు. జ్వరంతోపాటు ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందని డాక్టర్లు తెలిపారు. ఆయనకు యాంటీ వైరల్ డ్రగ్స్, అవసరమైనప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని పవన్‌కల్యాణ్ తెలిపారు. ఆయనకు ఇలా ఉన్న సమయంలో... ఈ గాజు గ్లాసు గుర్తు కోల్పోయిన అంశం పార్టీ శ్రేణులు, అభిమానుల్లో ఆందోళనను మరింత పెంచింది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.