మెదక్ బోరుబావి ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్

మెదక్ జిల్లాలో బోరుబావిలో పడి సాయి వర్ధన్ అనే మూడు సంవత్సరాల బాలుడు చనిపోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

news18-telugu
Updated: May 29, 2020, 3:45 PM IST
మెదక్ బోరుబావి ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్, సాయి వర్ధన్
  • Share this:
మెదక్ జిల్లాలో బోరుబావిలో పడి సాయి వర్ధన్ అనే మూడు సంవత్సరాల బాలుడు చనిపోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మూసేయాలని కోరారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘నోరు తెరిచిన బోరుబావులకు కళ్లెం వేయాలి.’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో బోరు బావిలో పడ్డ చిన్నారి సాయివర్ధన్ నిన్న ఉదయం మృతి చెందాడు. 12 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో 17 అడుగుల లోతు వద్ద మృతదేహం లభించింది. గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. భిక్షపతి బుధవారం రోజు తన పొలంలో బోర్లు వేశాడు. రెండు బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో మూడో బోరు బావిని కూడా తవ్వించారు. ఐతే ఆయన మనవడు సాయి వర్ధన్ తల్లిదండ్రులతో కలిసి పొలానికి వచ్చాడు. బోర్లు వేసిన అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో.. అతడు ఆడుకుంటూ వెళ్లి ఓ బోరుబావిలో పడిపోయాడు. వారి పొలంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
First published: May 29, 2020, 3:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading