తెలంగాణలో నేడు పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం... ఇవీ విశేషాలు...

Telangana Pattana Pragati : తెలంగాణలో పట్టణాల అభివృద్ధికి అందరూ కృషి చెయ్యాలని సీఎం కేసీఆర్ ఈమధ్య పిలుపిచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వం పట్టణ ప్రగతికి కొత్త కార్యక్రమం ప్రారంభిస్తోంది.

news18-telugu
Updated: February 24, 2020, 5:54 AM IST
తెలంగాణలో నేడు పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం... ఇవీ విశేషాలు...
పట్టణ ప్రగతి ప్రకటన (Image : Twitter)
  • Share this:
Telangana Pattana Pragati Program : తెలంగాణలో మున్సిపల్, సహకార ఎన్నికలు అయిపోయాయి. ఇక ఇప్పుడు పాలనపై పూర్తిగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ప్రభుత్వం ఇవాళ... పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ప్రారంభించబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరుకాబోతున్నారు. ఇందుకు సంబంధించి ZP గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభించాక కేటీఆర్... కొన్ని అభివృద్ధి పనులను చేపడతారు. అదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ ఇందులో పాలుపంచుకోనున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... తెలంగాణలో ఈ పది రోజులూ ఓ పండగ వాతావరణంలా... అంతా కళకళలాడుతూ రోజూ రకరకాల కార్యక్రమాలు జరుగుతూ సందడిగా ఉండబోతోంది. పది రోజుల తర్వాత సరికొత్త తెలంగాణ కనిపించే అవకాశం ఉంది.

పట్టణ ప్రగతి ప్రకటన (Image : Twitter)


పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రత్యేకతలు :

- ఇవాళ్టి నుంచీ మార్చి 4 వరకూ పది రోజులపాటూ పట్టణ ప్రగతి కార్యక్రమం అమలులో ఉంటుంది. ఇది తొలివిడత మాత్రమే.


- ఇందులో పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనం అనే అంశాలు ప్రధానమైనవి.
- ఇదివరకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం తెచ్చింది. అది హిట్టైంది. ఇప్పుడు దీన్ని హిట్ చెయ్యాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ టార్గెట్‌ను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
- పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టణ ప్రాంతాల్లో తిరుగుతూ పెండింగ్ పనులను 10 రోజుల్లో పూర్తిచేయిస్తారు.- వార్డుల వారీగా ప్రణాళిక తయారుచేసి, పనులు పూర్తి చేస్తారు.
- పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు, డంప్ యార్డుల నిర్మాణం, రక్షిత తాగునీటి సరఫరా, వీధి లైట్లు, రోడ్లపై గుంతల రిపేర్లను ముందుగా చేస్తారు.
- మూడు నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది.
- ఎనిమిది నెలల్లో కరెంటు సమస్యలన్నీ తీరాల్సి ఉంది.
- విఫలమైతే చైర్‌పర్సన్‌లు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు తమ పదవుల్ని కోల్పోతారు. సీనియర్‌ అధికారులున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను తనిఖీలు చేస్తాయి.
- దీర్ఘకాలంలో ప్రతీ పట్టణంలో అందమైన శ్మశానాలు, వెజ్, నాన్‌ వెజ్, పండ్లు, పూల మార్కెట్లు, స్ట్రీట్ వెండింగ్ జోన్స్, ఓపెన్‌ జిమ్‌లు, స్పోర్ట్స్ స్టేడియంలు నిర్మిస్తారు.
First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు