మృత్యుపాశమైన అంబులెన్స్... డోర్లు తెరచుకోక పేషెంట్ మృతి...

ప్రమాదం జరిగినా, అనారోగ్య ఆపద వచ్చినా... కుయ్... కుయ్... మంటూ రయ్యిన వచ్చే 108 అంబులెన్సే... ఆ వ్యక్తి ప్రాణం పోయేందుకు కారణమవ్వడం దురదృష్టకరం. అసలా సంఘటన ఎలా జరిగిందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 11:02 AM IST
మృత్యుపాశమైన అంబులెన్స్... డోర్లు తెరచుకోక పేషెంట్ మృతి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్... మలక్‌పేటలో జరిగిందీ విషాదం. లోకల్ MMTSలో వెళ్తున్న ప్రయాణికుడు ఆనంద్ (54)కి గుండెపోటు వచ్చింది. అది గమనించిన తోటి ప్రయాణికులు... అయ్యయ్యో అని అనుకుంటూ... 108కి కాల్ చేశారు. వెంటనే ఎక్కడ, ఎలా, ఏం జరిగింది... ఇలా డీటెయిల్స్ అడిగి... వేగంగా 108 అంబులెన్స్‌ని పంపించారు. అందులో అతన్ని ఎక్కించాలని డోర్లు తీస్తుంటే... ఎంతకీ డోర్లు తెరచుకోలేదు. ఎంత ప్రయత్నిస్తున్నా, అంబులెన్స్ సిబ్బందితోపాటూ... ఇతరులూ... అందరూ ట్రై చేసినా... డోర్లు ఓపెన్ కాలేదు. ఈ లోపు మృత్యువుతో చాలాసేపు పోరాడి... ఇక తన వల్ల కాక ప్రాణాలు విడిచాడు బాధితుడు. ఒక్క 5 నిమిషాల ముందు డోర్లు తెరచుకున్నా అతను బతికేవాడే.

అదేంటోగానీ... మన తెలుగు రాష్ట్రాల్లో... వైద్యం మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ... ఇదిగో ఇలాంటి సమస్యలు కూడా బాగానే ఉన్నాయి. ఆస్పత్రుల్లో దోమలు, ఎలుకలు, కుక్కలు ఉండటం ఒక సమస్యైతే... సమయానికి అంబులెన్స్‌లు రాకపోవడం, వచ్చినా... ఇలా ఏదో ఒక రకంగా రోగులకు ఇబ్బంది కలగడం మరో సమస్య. ఇక వైద్య ఖర్చులు ఎలాగూ తడిసి మోపెడవుతున్న ఉదంతాలు చాలా చూస్తున్నాం. సమస్యేంటంటే... వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా... చిన్నా, చితకా సమస్యల్ని సెటిల్ చెయ్యట్లేదు. పనికిరాని 108 వాహనాల్ని స్క్రాప్ కింద అమ్మేసి... కొత్త వాహనాలు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అలా చెయ్యకపోవడం వల్లే ఈ ఘటనలో బాధితుడు చనిపోయాడని అతని బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చనిపోయిన ఆనంద్... ఓ కార్పెంటర్. బేగంపేటలో పనిచేస్తున్నారు. రోజూ ఆయన మలక్ పేట దాకా వచ్చి, అక్కడి నుంచీ MMTSలో బేగంపేట వెళ్తారు. మంగళవారం రాత్రి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు