హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kamareddy : కామారెడ్డిలో విషాదం.. ఒకేసారి ఇద్దరికి గుండెపోటు.. పేషంట్‌తో పాటు వైద్యుడు కూడా ప్రాణాలు విడిచాడు..

Kamareddy : కామారెడ్డిలో విషాదం.. ఒకేసారి ఇద్దరికి గుండెపోటు.. పేషంట్‌తో పాటు వైద్యుడు కూడా ప్రాణాలు విడిచాడు..

మృతి చెందిన వైద్యుడు అండ్ పేషంట్

మృతి చెందిన వైద్యుడు అండ్ పేషంట్

Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ( Patiant and doctor Died for heart attack at a time ) హర్ట్‌ఎటాక్ తో ట్రిట్‌మెంట్‌కు వచ్చిన పేషంట్‌తో పాటు, చికిత్స అందించిన డాక్టర్‌ కూడా హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలాడు.

ఒక్కోసారి విధి వక్రీకరిస్తుందని అంటారు. అందుకే కొన్ని సంఘటనలు హఠాత్పరిమానాలను కల్గిస్తాయి.. అవి విషాదాన్ని నింపుతాయి. ( Patiant and doctor Died for heart attack at a time ) ఇలా ఓ సంఘటనలో నిజంగానే విధి వక్రీకరించింది. ప్రాణాలు నిలబెట్టుకుందామని ఆసుపత్రికి వెళితే.. చికిత్స అందించే వైద్యుడు కూడా అదే ప్రాణపాయ స్థితిలోకి వెళ్లడం చివరకు ఆ వైద్యుడు కూడా మృతి చెందడం చోటు చేసుకుంది. ఇద్దరు కొద్ది నిమిషాల తేడాలోనే కుప్పకూలిన సంఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డిలో జిల్లా ( Kamareddy ) గాంధారి మండలం గుజ్జులు తండాకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుకు గురి కావడంతో మండలకేంద్రంలోని ఎస్వీజి నర్సింగ్ హోంకు చికిత్స కోసం తీసుకువచ్చారు. ( Patiant and doctor Died for heart attack at a time ) అయితే ఆయన చికిత్స అందించేందుకు డాక్టర్ లక్ష్మణ్ ఆసుపత్రికి చేరుకున్నాడు. పేషంట్ ను పరీక్షిస్తున్న సమయంలోనే విషాదం చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తు డాక్టర్ లక్ష్మణ్‌ కూడా అదే సమయంలో గుండేపోటుకు గురయ్యాడు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. మరోవైపు చికిత్స కోసం వచ్చిన పేషంట్‌ను హుటాహుటిన కామారెడ్డి జిల్లా కేంద్రానికి తరలించారు. అయితే ఆ పేషంట్ కూడా మార్గమధ్యలోనే మృతి చెందాడు.


Osmania university : ఈ యూనివర్శిటిలో ఇక నో ఫ్రీ వాకింగ్.. యూజర్ చార్జీలు వసూలు..


దీంతో ఆసుపత్రికి పేషంట్ తోపాటు చికిత్స అందించేందుకు సిద్దమైన వైద్యుడికి కూడా గుండెపోటు రావడం అది కూడా డాక్టర్ లక్ష్మన్ సొంత ఆసుపత్రిలోనే ప్రాణాలు విడవడం స్థానికంగా సంచలనంగా మారింది. దీంతో మండల కేంద్రంలో విషాదం నెలకొంది. ( Patiant and doctor Died for heart attack at a time ) కాగా డాక్టర్ లక్ష్మణ్‌ ఇప్పటికే ఓ సారి హర్ట్ ఎటాక్ రావడంతో స్టంట్స్ వేసినట్టు తెలుస్తోంది. అయితే రోజు పేషంట్లను చూడడం, హఠాత్తుగా గుండేపోటు వచ్చిన వ్యక్తి ఆసుపత్రికి రావడంతో పాటు లాంటీ ఒత్తిళ్లతో ఆయన కూడా హార్ట్ ఎటాక్ గురైనట్టు తెలుస్తోంది.

First published:

Tags: Heart Attack, Kamareddy

ఉత్తమ కథలు