Medak : మెదక్‌లో విషాదం...! పిల్లల్ని పోషించలేక ప్రాణాలు వదిలిన దంపతులు...!

ప్రతీకాత్మక చిత్రం

Medak : కరోనా ప్రభావం ప్రత్యక్షంగా తగ్గిన దాని పరోక్ష ప్రభావం మాత్రం నుండి ప్రజలు కోలుకోవడం లేదు..గత రెండు సంవత్సరాలు సగటు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న కరోన పరిస్థితులు తాజాగా మరో కుటుంబాన్ని బలితీసుకున్నాయి.. కరోనా కాలంలో ఉపాధి లేకపోవడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

 • Share this:
  ఆర్థిక పరిస్థితులు.. భవిష్యత్‌లో జరిగే పరిణామాలు రెండింటిని దృష్టిలో పెట్టుకుని తమ రక్తం పంచుకుని పుట్టిన పసి పిల్లలపై తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. జీవన పోరాటంలో తాము పడుతున్న కష్టాలకు దూరంగా పారిపోతున్నారు... ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేని తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతూ... తమ పిల్లలు సైతం ఇలాంటీ కష్టాలను భరించకూడదనే నిర్ణయానికి వస్తున్నారు.

  దీంతో తమతోపాటు వారిని కూడా నిర్ధాక్షిణ్యంగా కడతేరుస్తున్నవారు కొందరైతే..మరి కోందరు వారిని ఒంటరి చేసి మరిన్ని కష్టాలకు కారకులవుతున్నారు. ఇలా కుటుంబాలకు కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు రాష్ట్రంలో అనేకం చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. దీనికి తోడు కరోనా పరిస్థితులు ప్రజలను ఇంకా పీడకలగా వెంటాడుతోంది. కరోనా పరిస్థితులను ఎదుర్కొలేని వారు ప్రాణాలను తీసుకోవడమనే అంతిమ నిర్ణయానికి వస్తున్నారు.బతుకు మీద ధైర్యం కోల్పోయి...ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.

  తాజాగా ఓ జంట తమ ఇద్దరు చిన్నారులను పోషించలేని స్థితిలోకి మారి..ప్రాణాలు బలితీసుకున్నారు.
  మెదక్ జిల్లా పోతిన్ పల్లికి చెందిన కిషోర్, కవిత దంపతులకు ఇద్దరు కుమారులు. ఉపాధి కోసం కొన్ని సంవత్సరాల క్రితం వీరు హైదరాబాద్​కు తరలివచ్చారు. చిలకల గూడలో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని సెలున్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. దీంతోనే తమ ఇద్దరు కొడుకులను పోషిస్తున్నారు... కానీ కరోనా రూపంలో వారికి కష్టాలు మొదలయ్యాయి. లాక్​డౌన్ కారణంగా సెలున్‌కు పూర్తిగా గిరాకీ తగ్గిపోయింది. ఏడాదికి పైగా వ్యాపారం నడవకపోవడంతో ఆర్థికంగా బాగా చితికిపోయారు. పిల్లల కడుపు నింపేందుకు కూడా డబ్బులు లేని స్థితికి చేరిపోయారు.

  వారికి కావాల్సిన సౌకర్యాలు అందించలేక సతమతయ్యారు. ఈ క్రమంలోనే తమ ప్రాణాలను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు...దీంతో నాలుగు రోజుల క్రితం కిషోర్, కవిత దంపతులు తమ పిల్లలతో కలిసి వారి స్వస్థలమైన పోతిన్ పల్లికి వెళ్లి నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నారు... అనంతరం బుధవారం హైదరాబాద్​​కు తిరుగు ప్రయాణం అయ్యారు. పిల్లలను అక్కడే ఉంచి భార్య కవితను తీసుకొని టూ వీలర్‌పై బయలు దేరాడు. మార్గ మధ్యలో తూప్రాన్ వద్ద పురుగుల మందు కొనుగోలు చేశారు. మాసాయిపేట సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి ఆ దంపతులిద్దరూ పురుగుల మందు తాగారు.

  అయితే పురుగుల మందు తాగిన అనంతరం కడుపులో మంట అధికం కావడంతో భరించలేక భార్యాభర్తలిద్దరూ వారి ద్విచక్రవాహనంపై తూప్రాన్ ప్రభుత్వ స్వయంగా ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కవితను ,ఉస్మానియాకు కిషోర్‌ను పంపించారు...కాగా చికిత్స పొందుతూ గురువారం కవిత మృతి చెందింది. ఇక ఉస్మానియా అసుపత్రిలో కిషోర్ శుక్రవారం తెల్లవారుజామున చనిపోయాడు.

  ఎన్నో ఆశలతో భాగ్యనగరానికి చేరుకున్న ఈ దంపతుల కథ విషాదాంతమయింది. తాము పిల్లల కోసం కన్న కళలు నేరవేర్చలేని వారు..వారిని మరింత కష్టాల్లోకి పంపి తనువు చాలించారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు.
  Published by:yveerash yveerash
  First published: