Home /News /telangana /

PARENTS ARE CONCERNED ABOUT THE DEATH OF A HOSTEL STUDENT IN ADILABAD DISTRICT SNR ADB

Telangana : హాస్టల్‌లో బాలిక మృతి ..శవాన్ని ఇంటికి తీసుకెళ్లి అప్పగించడంపై పేరెంట్స్ ఆగ్రహం

(student died)

(student died)

Telangana: ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల రోజే ఓ ఆదివాసి గిరిజన బాలిక హాస్టల్‌లో ప్రాణాలు కోల్పోవడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. టెన్త్ క్లాస్ చదువుతున్న బాలికకు హెల్త్ బాగోలేదని హాస్పటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ చనిపోవడంతో ..శవాన్ని ఇంటికి తీసుకెళ్లి అప్పగించడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Adilabad, India
    (K.Lenin,News18,Adilabad)
    బాలికల విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనారోగ్యంతో మృతి(Student died)చెందింది. అయితే తమ కూతురు అనారోగ్యం పాలైన విషయం సిబ్బంది తమకు తెలియపరచలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ మృతికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణంటూ మృతదేహంతో ఆందోళనకు సిద్దమయ్యారు. ఈవిషయంలో జిల్లా స్థాయి అధికారులు బాలిక తల్లిదండ్రులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలాబాద్(Adilabad)జిలా ఉట్నూరు (Utnur) మండలం కేంద్రంలోని కస్తూర్భా గాంధీ హాస్టల్‌(Kasturbha Gandhi Hostel)లో ఈఘటన కలకలం రేపింది.

    Crime news : మాట్లాడాలని యువతిని పార్కుకు తీసుకెళ్లాడు .. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో ..



    టెన్త్ క్లాస్ విద్యార్ధిని..
    తెలంగాణలోని సంక్షేమ, మైనార్టీ గురుకుల హాస్టళ్లలో విద్యార్ధుల భద్రత, ఆరోగ్యంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వసతి గృహంలో పదవ తరగతి బాలిక మృతి మరింత కలకలం రేపింది. ఉట్నూరు మండలం జెండాగూడా గ్రామానికి చెందిన 14 ఏళ్ళ ఆదివాసి గిరిజన విద్యార్థిని కవిత ఉట్నూరులోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి చదువుకుంటూ వసతి గృహంలో ఉంటోంది.



    హాస్టల్‌ స్టూడెంట్ మృతి..
    కవితకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోకపోవడంతో వసతి గృహ సిబ్బంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ కవిత మంగళవారం చనిపోయింది. విద్యార్ధిని మృతి చెందిన తర్వాత వసతి గృహ సిబ్బంది కవిత మృతదేహాన్నిఉట్నూరు మండలం జెండాగూడ గ్రామానికి తరలించారు. చదువుకోవడానికి వెళ్లిన తమ కూతురు శవంగా ఇంటికి తిరిగి రావడం చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఎలా చనిపోయిందని హాస్టల్ సిబ్బందిని ప్రశ్నిస్తే అనారోగ్యంతో మృతి చెందినట్లుగా చెప్పడంతో ఆందోళనకు దిగారు. ఆరోగ్యం బాగోకపోతే తమకు సమాచారం ఇవ్వలేదని మృతురాలి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు.

    న్యాయవిచారణపై హామీ ..
    కవిత మృతికి కస్తూరిబా వసతి గృహం సిబ్బంది కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృత దేహంతో తల్లిదండ్రులు, బంధువులు ఐటిడిఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టి న్యాయం చేస్తామని ఐటిడిఏ అధికారులు భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు.

    Telangana : ముందస్తు కోసం మనీ సిద్ధం .. ఇప్పటి నుంచే గ్రామల్లోకి తరలిపోతున్న నోట్ల కట్టలు



    ఆదివాసీ దినోత్సవం రోజే ..
    ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల రోజే ఓ ఆదివాసి గిరిజన బాలిక హాస్టల్‌లో ప్రాణాలు కోల్పోవడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకునేందుకు మండల కేంద్రాల్లోని హాస్టల్‌లో ఉంటున్న విద్యార్ధినుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదా అని ఆదివాసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Adilabad, Hostel students, Telangana News

    తదుపరి వార్తలు