Home /News /telangana /

PAPAYA FARMER PROTEST ON ROAD AFTER TSRTC DRIVER DENIED HIM TO GET IN INCIDENT AT NAGARKARNOOL DIST PIC GOES VIRAL MKS

Viral Photo: పేద రైతుకు అవమానం.. పంటతో రోడ్డుపై ఒంటరిగా నిరసన -TSRTC బస్సు డ్రైవర్ వల్లే!

ఆర్టీసీ బస్సుకు అడ్డంగా రైతు గోపయ్య నిరసన

ఆర్టీసీ బస్సుకు అడ్డంగా రైతు గోపయ్య నిరసన

ఉచితంగా బొప్పాయి పండ్లు ఇవ్వలేదనే అక్కసుతో రైతును బస్సు ఎక్కించుకునేందుకు నిరాకరించాడు టీఎస్ ఆర్టీసీ డ్రైవర్. దీనికి ప్రతీకారంగా ఆ రైతు.. బస్సు తిరుగు ప్రయాణంలో రోడ్డుపైనే నిరసనకు దిగాడు. వైరల్ అవుతోన్న ఈ ఫొటో వెనుక అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...
కార్ల షోరూమ్ లో అవమానానికి గురైన ఓ బడా రైతు ప్రతీకారంగా అర గంటలో రూ.10లక్షలిచ్చి కొత్త కారును కొన్న ఉదంతం ఇటీవల కర్ణాటకలో చోటుచేసుకుంది. అయితే, తెలంగాణలో జరిగిన తాజా ఘటనలోనూ రైతు అవమానానికి గురయ్యాడు. అతణ్ని ఆర్టీసీ బస్సులో ఎక్కించుకోడానికి డ్రైవర్ నిరాకరించాడు. అయితే ఇతను పేదరైతు కావడంతో తనదైన శైలిలో నిరసన తెలిపాడు. నడిరోడ్డుపై బస్సును గంటపాటు నిలిపేయించాడు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకు ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రైతు చర్యను ప్రశంసిస్తూ, ఆర్టీసీ డ్రైవర్ తీరును తప్పుపడుతూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వివరాలివి..

నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మారేడు మాన్ దిన్నె గ్రామం నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం. ఈ గ్రామం మీదుగా కేవలం ఒకే ఒక్క (అచ్చంపేట డిపోకు చెందిన) ఆర్టీసీ బస్సు వెళుతుంది. మాన్‌దిన్నె గ్రామానికి చెందిన రైతు గోపయ్య తన వ్యవసాయ పొలంలో పండించిన బొప్పాయి పండ్లను ప్రతినిత్యం ఈ బస్సులోనే కొల్లాపూర్ పట్టణానికి తీసుకువెళ్లి అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. పండ్లను తీసుకెళ్లేందుకుగానూ ప్రతిరోజూ అతను లగేజ్ టికెట్ కూడా తీసుకుంటాడు. కానీ శుక్రవారం సీన్ మరోలా మారింది..

ఆర్టీసీ బస్సుకు అడ్డంగా బొప్పాయి రైతు నిరసన

Soundarya Suicide : మాజీ సీఎం మనవరాలు.. చిటికెస్తే సకల సౌకర్యాలు.. అయినా, సౌందర్య ఎందుకలా చేసింది?


రైతు గొపయ్య ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కూడా బొప్పాయి పండ్ల బుట్టలతో బస్ స్టాపు వద్ద నిలిచాడు. కానీ ఈసారి ఆర్టీసీ డ్రైవర్ పండ్లను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత దూరం పోయి పండ్లు అమ్మితే మిగిలేదే అరకొర అని, లగేజ్ టికెట్ తీసుకుంటుండగా ఉచితంగా పండ్లెందుకు ఇవ్వాలని రైతు ఎదురుప్రశ్నించాడు. అంతే, రైతును ఎక్కించుకోడానికి నిరాకరిస్తూ, బస్సును రయ్యిన ముందుకుపోనిచ్చాడు డ్రైవర్. ఆర్టీసీ డ్రైవర్ తీరుతో చిన్నబుచ్చుకున్న రైతు గోపయ్య ఆ రోజు పండ్లను అమ్ముకునే మరో దిక్కు లేక రోడ్డుపైనే ఉండిపోయాడు. కొన్ని గంటల తర్వాత..

17th century stepwell: హైదరాబాద్‌లో 17వ శతాబ్దం నాటి అరుదైన మెట్ల బావి.. ఆగస్టు 15నాటికి..


ఆర్టీసీ బస్సు కొల్లాపూర్ నుంచి తిరుగు ప్రయాణంలో మాన్‌దిన్నె గ్రామానికి చేరుకోగా, అప్పటికీ రోడ్డుపైనే ఉన్న రైతు గొపయ్య.. బొప్పాయి పండ్ల గంపలను అడ్డంగా పెట్టేసి బస్సును అడ్డుకున్నాడు. డ్రైవర్ అత్యాశకు పోయి రైతును ఎక్కించుకోక పోవడం వల్ల పండ్లు అలాగే మిగిలిపోయాయి. బస్సుకు అడ్డంగా బొప్పాయి పండ్ల బుట్టలను ఉంచి రైతు నిరసన చేస్తోన్న దృశ్యాన్ని స్థానికులు చిత్రీకరించారు. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరల్ అయింది.

రైతు గొపయ్య

Viral Video: వామ్మో! వట్టి చేతులతో భారీ కింగ్ కోబ్రాను వంచేశాడు.. దయచేసి మీరిలా చేయొద్దు..



టీఎస్ ఆర్టీసీపై తనకు ఎంతో గౌరవం ఉందని, ప్రతిరోజూ బస్సులోనే లగేజ్ టికెట్ తీసుకొని పండ్లను కొల్లాపూర్ తీసుకెళ్లి అమ్ముకుంటానని, అయితే, డ్రైవర్ తీరు వల్ల శుక్రవారం నాడు పంటను అమ్ముకోలేకపోయానని రైతు గోపయ్య అంటున్నాడు. ఉన్నతాధికారులు స్పందించి సదరు డ్రైవర్ ను మందలించాల్సిందిగా, మరోసారి రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిందిగా గోపయ్య కోరుతున్నాడు. రైతు నిరసన ఫొటోను, ఘటనను టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్యాగ్ చేశారు పలువురు నెటిజన్లు. దీనిపై సజ్జనార్ స్పందించాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Farmer, Nagarkarnol district, Tsrtc, Viral photo

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు