Home /News /telangana /

PANCHAYAT SECRETARY WASHED HIS FEET WITH A LOW RANKING EMPLOYEE IN MAHABUBABAD DISTRICT SNR

Telangana : ఆ మేడమ్ పెద్ద ఆఫీసర్ .. కిందిస్థాయి ఉద్యోగినితో ఏం పని చేయించుకుందో తెలుసా..

Viral photo

Viral photo

Telangana : సమాజంలో కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బందిని చులకనగా చూసే వ్యక్తులు ఎక్కువగానే ఉన్నారని తెలుస్తోంది. చిన్నస్థాయి ఉద్యోగి అయితే వారితో వ్యక్తిగత పనులు కూడా చేయించుకుంటే తప్పేంటి అనే విధంగా ప్రవర్తించిన ఓ అధికారిణి వ్యవహారంపై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mahabubabad, India
దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వజ్రోత్సవాల పేరుతో ఘనంగా జరుపుకుంటున్నాం. మరోపక్క సమాజంలో ఏదో ఓ మూల ఆధిపత్య ధోరణి, అణగదొక్కే స్వభావం, అసమానత్వం, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బందిని చులకనగా చూసే వ్యక్తులు ఎక్కువగానే ఉన్నారని తెలుస్తోంది. చిన్నస్థాయి ఉద్యోగి అయితే వారితో వ్యక్తిగత పనులు కూడా చేయించుకుంటే తప్పేంటి అనే విధంగా ప్రవర్తించారు మహబూబాబాద్(Mahabubabad)జిల్లాలో ఓ పంచాయితీ కార్యదర్శి(Panchayat secretary). ప్రభుత్వ ఉద్యోగులంతా(Government employees) ప్రజలకు సేవ చేయడానికి జీతం ఇస్తుంటే ఆ మేడమ్ సఫాయి కార్మికురాలి(Safai worker)తో తన పని చేయించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో విస్తృతంగా వైరల్(Viral)అవుతోంది.

Suicide attempt : మేం లవర్స్ కాదు మాది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ .. ఎవరూ నమ్మడం లేదని ఏం చేశారో తెలుసా



పెద్ద ఉద్యోగమనే పొగరు..
ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరూ సాదా,సీదాగా ఉండరు. కొందరు కాస్త పొగరుగా వ్యవహరిస్తారు. ఇంకొందరు మాకు తిరుగులేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామపంచాయతీలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి అనే అధికారిణి తీరు ఇందుకు అద్దం పట్టినట్లుగా కనిపిస్తుంది. డ్యూటీలో భాగంగా పంచాయతీ కార్యాలయం ఆవరణలో తిరిగిన సమయంలో ఆమె కాళ్లకు, చెప్పులకు బురద అంటుకుంది. వెంటనే పంచాయతీ కార్యాలయంలో సఫాయి కార్మికురాలిగా పని చేస్తున్న మహిళను పిలిపించుకొని తన చెప్పులు, కాళ్లను కడిగించుకున్నారు పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి.



కిందిస్థాయి ఉద్యోగిని అంటే అంచ చులకన..
హోదా, గౌరవాన్ని ఇస్తుంది. వ్యక్తిత్వం ఆ గౌరవాన్ని మరింత పెంచుతుందనే విషయం తెలియని అధికారిణి కిందిస్థాయి ఉద్యోగినితో తన కాళ్లు, చెప్పులు కడిగించుకోవడం అక్కడే ఉన్న కొందరు సెల్‌ఫోన్‌తో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మేడమ్ గొప్పతనం అందరికి తెలిసిపోయింది. ఇంకే ముందు చిన్నస్థాయి ఉద్యోగులంటే అంత చులకన స్వభావం ఏమిటి అంటూ కొందరు..మీ కింద పని చేస్తే ..మీ కాళ్లు, చెప్పులు కడగాలా అంటూ మరికొందరు పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మిని ప్రశ్నలతో విమర్శలతో కడిగిపారేస్తున్నారు.

Telangana : కొంప ముంచిన నిద్రమత్తు .. కళ్లు మూసి తెరిచేలోపే గాల్లో కలిసిన నాలుగు ప్రాణాలు



సస్పెండ్‌ చేయాలని డిమాండ్..
పంచాయతీ కార్యదర్శి అహంకారాన్ని ప్రదర్శిస్తూ చేసిన ఈ నిర్వాకానికి సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా బయటకు రావడంతో జిల్లాలోని కిందిస్థాయి ఉద్యోగులు ఖండిస్తున్నారు. తన కింద పని చేసే ఉద్యోగులను గౌరవించని పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Mahabubabad, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు