Home /News /telangana /

PANCHAYAT SECRETARIES ARE INCENSED AT THE CONSTANT SURVEILLANCE ON THEM KMM VB

మాకొద్దు బాబోయ్‌ ఈ కొలువులు.. రోజంతా ఇలా ఉండలేం.. సర్కారు హుకుంతో బెంబేలెత్తుతున్న ఆ ఉద్యోగులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Crime: తమపై నిరంతర నిఘాపై పంచాయతీ కార్యదర్శులు మండిపడుతున్నారు. నెత్తిమీద కెమెరా పెట్టి తమను, తమ ఇంటిగ్రిటీని అవమానించడం పట్ల ఆగ్రహిస్తున్నారు. ఉద్యోగ విధుల నిర్వహణపై ఇంతటి దారుణమైన నిఘా గతంలోనూ, ఇప్పుడూ ఎక్కడా ఎవరి పైనా లేదనీ, తమ పట్ల సర్కారు వ్యవహరిస్తున్న తీరు మాత్రం దారుణంగా ఉందని వాపోతున్నారు.

ఇంకా చదవండి ...
  (G. SrinivasaReddy, News18, Khammam)

  తమపై నిరంతర నిఘాపై పంచాయతీ కార్యదర్శులు (Panchayat secretary) మండిపడుతున్నారు. నెత్తిమీద కెమెరా(Camera)  పెట్టి తమను, తమ ఇంటిగ్రిటీని అవమానించడం పట్ల ఆగ్రహిస్తున్నారు. ఉద్యోగ విధుల నిర్వహణపై ఇంతటి దారుణమైన నిఘా గతంలోనూ, ఇప్పుడూ ఎక్కడా ఎవరి పైనా లేదనీ, తమ పట్ల సర్కారు వ్యవహరిస్తున్న తీరు మాత్రం దారుణంగా ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన డీఎస్‌ఆర్‌(DRS) సిస్టం ద్వారా అటెండెన్స్‌, ఇంకా ఎప్పటికప్పుడు తమ కదలికలపై నిఘా పెట్టినట్టుండే యాప్‌ను ఉపయోగించలేమని ఉద్యోగులు తెగేసి చెబుతున్నారు. 

  Telangana Rains: తెలంగాణలో మళ్లీ వానల జోరు.. ఈ జిల్లాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన..


  ఇలాంటి నిర్ణయాల వల్ల తీవ్ర వత్తిడికి గురై తాము ఉద్యోగాలు చేయలేని పరిస్థితి తలెత్తుతోందని రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన అటెండెన్స్‌ సిస్టం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన విధానం ప్రకారం.. సదరు పంచాయతీ కార్యదర్శి తన ఫోన్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డీఎస్‌ఆర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంది. దీనికి జీపీఎస్‌ ట్రాక్‌. యనేబుల్‌ చేయాలి. తాను పనిచేస్తున్న పంచాయతీ ఆఫీసు వద్ద నిత్యం సెల్పీ పొటో తీసుకుని అప్‌లోడ్‌ చేస్తేనే అటెండెన్స్‌ నమోదు అవుతుంది. లేదంటే లేనట్టే. 

  వాళ్లిద్దరు స్నేహితులు.. ఓ రోజు పొలం పనులకని వెళ్లారు.. తిరిగి వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు.. అసలేం జరిగిందంటే..


  ఇది పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలపై తీవ్ర వత్తిడిని పెంచినట్లయింది. దీంతో తాము ఈ ఉద్యోగాలు చేయలేమని, ఇది కేవలం తమను వేధించడం కోసమే చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద తమ నిరసనను తెలియజేశారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, లబ్దిదారుల ఎంపిక, పింఛన్ల పంపిణీ, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, రక్షిత నీటి సరఫరా, రికార్డుల నిర్వహణ, సర్టిఫికెట్ల జారీ లాంటి డ్యూటీలతో పాటు ఉపాధి హామీ పథకం అమలుతో ఇప్పటికే సతమతం అవుతున్న పంచాయతీ కార్యదర్శులు తాజాగా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విధానంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇలా నిరంతరం తమపై నిఘా పెట్టడం సరికాదని వాపోతున్నారు.

  వాస్తవానికి ఈ కొత్త విధానాన్ని ఈ నెల 16వ తేదీన అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం సత్వరం అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే ఇప్పటిదాకా నాలుగోవంత ఉద్యోగులు కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. పైగా ఈ విధనాన్ని నిరసిస్తున్నారు. రాష్ట్రంలో మొ త్తం 12,769 మంది పంచాయతీ కార్యదర్శులు ఉండగా, ఇప్పటిదాకా కేవలం 3,639 మంది మాత్రమే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ సంఖ్య రెండంకెలకు దాటలేదంటే. ఉద్యోగుల నిరసన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా డౌన్‌లోడ్‌ చేసుకున్న వాళ్లు సైతం మళ్లీ అన్‌ ఇన్‌స్టాల్‌ చేశారు. మెదక్‌, ఆదిలాబాద్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, సూర్యపేట, నల్గొండ జిల్లాల్లో కేవలం ఇరవై ముప్పై మంది మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

  Minor Girl Kidnap: ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడు.. చివరకు అతడు చేసిన చర్యకు పోలీసులు ఆశ్చర్యపోయారు..


  ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 255 పంచాయతీ కార్యదర్శులకు కేవలం ఆరుగురు, భద్రాద్రి కొత్తగూడెంలో 481 మందికి కేవలం 11 మంది, యాదాద్రి భువనగిరిలో 421 మందికి గానూ కేవలం 9 మంది, వనపర్తి జిల్లాలో 255 మందికి గానూ ఐదుగురు, జోగులాంబ జిల్లాలో 255 మందికి కేవలం ఇద్దరు మాత్రమే అటెండెన్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

  Romance In Flight: విమానంలో హద్దుమీరిన జంట.. పాడుపని చేస్తూ.. వీడియో వైరల్..


  ఇప్పటికే తమ రోజువారీ విధులకు తోడు పల్లె ప్రకృతి వనం, హరిత హారం, రోజూ పారిశుధ్యం, విలేజ్‌ నర్సరీల నిర్వహణకు తోడు ఉపాధి హామీ పథకం అమలు సవాలుగా మారింది. కూలీలు రాకపోయినా కార్యదర్శులనే బాధ్యులుగా చేస్తూ మెమోలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. పైగా తమకు కన్సాలిడేటెడ్‌ కింద ఇస్తున్న మొత్తం నామమాత్రమేనని, పని మాత్రం పదిహేను గంటలు పైగా చేయిస్తున్నారని, పైగా ప్రోబేషన్‌ డిక్లేర్‌ చేయడానికి నాలుగేళ్ల కాలం తప్పనిసరి చేయడం లాంటి వాటిపైనా కార్యదర్శుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. దీనిపై ప్రభుత్వానికి తమ నిరసనను తెలపడానికి సోమవారం నాడు. అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Khammam, Panchayat secretery

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు