Home /News /telangana /

PALLEKOILA SONG IN POWER STAR MOVIE BHEEMLA NAYAK DURGAVVA SONG GOES VIRAL ADB VB

Viral Song: పవర్ స్టార్ సినిమాలో పల్లెకోయిల పాట.. మొన్న మోగిలయ్య.. ఇపుడు దుర్గవ్వ.. వైరల్ అవుతున్న సాంగ్..

దుర్గవ్వ

దుర్గవ్వ

అలసిపోయిన పల్లె ప్రజలకు ఆటవిడుపు, వారి అలసటను తీర్చి సాంత్వన చేకూర్చేవి జానపదాలు.  అంతేకాదు జనజీవన సంస్కృతికి దర్పణం పట్టేవి కూడా ఈ జానపదాలే. అయితే పల్లీయులు తమ జీవితంలోని కష్ట సుఖాలను బాణీలుగా అల్లుకొని పాడే పాటలు ఈ జానపద పాటలు.

ఇంకా చదవండి ...
    (కట్ట లెనిన్, న్యూస్ 18, ఆదిలాబాద్ జిల్లా)

    అలసిపోయిన పల్లె ప్రజలకు ఆటవిడుపు, వారి అలసటను తీర్చి సాంత్వన చేకూర్చేవి జానపదాలు.  అంతేకాదు జనజీవన సంస్కృతికి దర్పణం పట్టేవి కూడా ఈ జానపదాలే. అయితే పల్లీయులు తమ జీవితంలోని కష్ట సుఖాలను బాణీలుగా అల్లుకొని పాడే పాటలు ఈ జానపద పాటలు. వినసొంపుగా ఉండే ఈ పల్లె పాటలకు ఒకప్పుడు ఎంతో ఆదరణ లభించేది. కాని ఇపుడు కొంత మసకబారిపోయినా తెలుగు సినిమా వాటికి కొత్త సొగసులు అద్ది ప్రాచూర్యం కల్పిస్తోంది. ఈ మధ్య కాలంలో పలు తెలుగు సినిమాల్లో జానపద బాణీల్లో సాగే పాటలను పెట్టి హిట్టుకొట్టాయి. పలువురు జానపద కళాకారులు కూడా సినిమా రంగంలో ప్రవేశించి రాణిస్తున్నారు.

    Zodiac Signs: ఈ మూడు రాశుల వారు తెలివిలో మిన్న.. ‘కట్టప్ప’లను సైతం పసి గట్టేస్తారు..


    ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మారుమూల పల్లెటూరు రొయ్యలపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారిణి కమ్మరి దుర్గవ్వకు కూడా అరుదైన అవకాశం దక్కింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ పాట పాడే అవకాశం లభించింది. అదికూడా జానపద బాణీలో సాగే పాట. పవన కళ్యాణ్ హీరో నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా కోసం కమ్మరి దుర్గమ్మ చేత సంగీత దర్శుకుడు థమన్ ఓ పాటను పాడించాడు.  చెపుతున్న నీ మంచి చెడ్డా.. ఆంతోని పంతాలు పోబోకు బిడ్డా.. అంటూ సాగే ఈ పాటను దుర్గవ్వ చేత పాడించారు సంగీత దర్శకుడు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట వారం రోజుల కిందట విడుదలై బాగా వైరల్ అవుతోంది. మారుమూల పల్లెటూరికి చెందిన ఓ జానపద గాయనికి స్టార్ హీరో చిత్రంలో పాట పాడే అవకాశం రాడడం, అది ప్రాచూర్యం కూడా పొందటం స్థానికులకు ఆనందాన్నిస్తోంది.

    Shocking News: తరగతి గదిలో విద్యార్థుల అరాచకం.. ఉపాధ్యాయుడి నెత్తిపై చెత్త బుట్టతో.. మరీ ఘోరంగా..


    అయితే కుమ్మరి దుర్గవ్వ భర్త రాజయ్య మృతితో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూనే తన ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. పొలం పనులకు వెళ్ళినపుడు తనకు వచ్చిన జానపద పాటలు పాడుకుంటూ దుర్గవ్వ పనులు చేసుకుంటూ ఉండేది. అలా జానపద పాటలు పాడే అలవాటు ఉన్న దుర్గవ్వ ప్రతిభను గుర్తించిన స్థానిక కళాకారులు ఆమెకు అవకాశాలు కల్పించారు. అలా పాడిన సిరిసిల్ల సిన్నది..  ఉంగురమే రంగైన రాములాల.. పాటలతో దుర్గవ్వ మంచి గుర్తింపును పొందింది.

    Free Ration In Telangana: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఉచిత బియ్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..


    తాజాగా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాలో పాడే అరుదైన అవకాశం దక్కించుకొంది. ఇదే సినిమాలో పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్యకు కూడా అవకాశం లభించింది. మొగులయ్యి పాడిన పాటకు కూడా జనాదరణ బాగానే లభించింది. ఏదిఏమైనా ఓ మారుమూల పల్లెకు చెందిన నిరుపేద జానపదా గాయనికి ఇలాంటి అవకాశం దక్కడం విశేషమని స్థానికులు చెప్పుకుంటున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Adilabad, Bheemla Nayak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు