రైతులెవరూ ఆందోళన చెందొద్దు.. రైతు సమన్వయ సమితి సభ్యులకు పల్లా లేఖ

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా వ్యవసాయ మార్కెట్లను మూసేశారు. ఈ నేపథ్యంలో రబీలో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతు సమన్వయ సమితి సభ్యులకు ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి లేఖ రాశారు.

news18-telugu
Updated: March 25, 2020, 5:25 PM IST
రైతులెవరూ ఆందోళన చెందొద్దు.. రైతు సమన్వయ సమితి సభ్యులకు పల్లా లేఖ
ధాన్యం (సాధారణం) రూ.1868 (క్వింటాల్)
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో రైతుల సంక్షేమం ద‌ృష్ణ్ట్యా అన్ని వ్యవసాయ మార్కెట్లను మూసేశారు. ప్రస్తుతం యాసంగి పంట దిగుబడి సమయం కావడంతో రైతులు ధాన్యం అమ్మాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందకుండా రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు సమన్వయ సమితి సభ్యులకు లేఖ రాశారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన ప్రతి ఊరిలో ఐకేపీ సెంటర్లు, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్, ఇతర సంస్థల వారు సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ, మార్కెటింగ్ అధికారుల ద్వారా తెలుసుకుని రైతులకు సరైన సమాచారం ఇవ్వాలని సమితి సభ్యులకు సూచించారు.

పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. వ్యవసాయ పనులు చేసేవారు గుంపులు గుంపులుగా లేకుండా చూడాలని, వ్యవసాయ పనులు మినహా మిగతా పనులకు వెళ్లొద్దని సూచించారు. మూడు వారాలు జాగ్రత్తగా ఉంటూ మన తోటి రైతులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులమంతా ఏకమై.. కరోనాని తరిమికొడదామని పేర్కొన్నారు.
Published by: Narsimha Badhini
First published: March 25, 2020, 5:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading