పాకిస్తాన్‌లో హైదరాబాద్ యువకుడు అరెస్ట్...

అతడితో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన మరో యువకుడిని పాక్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరిచారు. దీనికి సంబంధించి ప్రశాంత్‌తో వీడియో రికార్డు చేయించి విడుదల చేశారు.

news18-telugu
Updated: November 18, 2019, 8:13 PM IST
పాకిస్తాన్‌లో హైదరాబాద్ యువకుడు అరెస్ట్...
పాకిస్తాన్ ఇద్దరు భారతీయుల అరెస్ట్
  • Share this:
పాకిస్తాన్‌లో ఇద్దరు భారతీయుల యువకులు అరెస్టయ్యారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా కొలిస్తాన్ ఎడారి ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో వారిని అరెస్ట్ చేసినట్లు బాహవల్ పూర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. అరెస్టైన వారిలో హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ అనే యువకుడు కూడా ఉన్నాడు. అతడితో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన మరో యువకుడిని పాక్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరిచారు. దీనికి సంబంధించి ప్రశాంత్‌తో వీడియో రికార్డు చేయించి విడుదల చేశారు.

ఇక్కడ అంతా బాగానే ఉంది. పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి జైలుకు పంపిస్తారు. జైలు నుంచి ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇస్తారు. ఆ తర్వాత బెయిల్ వస్తే మీతో మాట్లడవచ్చు. మరో నెల రోజుల్లో విడుదల అయ్యే అవకాశముంది.
ప్రశాంత్
ప్రశాంత్ అరెస్ట్‌తో హైదరాబాద్‌లో ఉండే అతడి తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన నెలకొంది. వీలైనంత త్వరగా ప్రశాంత్‌ను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com