PADDY ISSUE REACHED TO DELHI AND TRS BJP LEADERS AT DELHI VRY
Paddy Dispute : ఢిల్లీలో వరి వార్... మంత్రి పియూష్ గోయల్‌తో బీజేపీ, టీఆర్ఎస్ నేతల భేటి...
ఫైల్ ఫోటో..
Paddy Dispute : ఢిల్లీలో వరి వార్ పీక్ స్టేజికి చేరింది. గత మూడు రోజులుగా టీఆర్ఎస్ మంత్రులు ఎంపీలు మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే అంతకంటే ముందుగా తెలంగాణ బీజేపీ నేతలు ఆయనతో సమావేశం అయ్యారు.
వరి ధాన్యం కొనుగోళ్లు గత కొద్ది రోజులుగా రాజకీయ విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలోనే తాజాగా వరి వార్ ఢిల్లీకి ( Delhi ) చేరుకుంది. తాజాగా అది మరింత వివాదంగా మారనుంది. ( Paddy Dispute ) వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తన్నారు. వీటిపై అధికారిక హమి ఇవ్వాల్సిందిగా కేంద్రమంత్రి పియూష్ గోయల్‌ను ( Piyush goel ) డిమాండ్ చేస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితమే టీఆర్ఎస్ ( TRS ) నేతలు ఢిల్లీ వెళ్లారు. కాని కేంద్రమంత్రి అపాయింట్మెంట్ మాత్రం లభించలేదు. అయితే రెండు రోజులగా ముంబయిలో ఉన్నట్టు చెబుతున్నా.. సోమవారం టీఆర్ఎస్ నేతలు పార్లమెంట్ ( parlament ) అవరణలో మంత్రిని కలిసి అపాయింట్మెంట్ కోరారు. దీంతో నేడు మధ్యాహ్నం రెండున్నర తర్వాత వారికి అపాయింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
కాగా మరోవైపు తెలంగాణకు ( Telangana ) చెందిన బీజేపీ ( BJP ) నేతలు సైతం ఢిల్లీకి ( Delhi ) చేరుకున్నారు. కేంద్రమంత్రి అమిత్ షాతో మంత్రి కిషన్‌రెడ్డి,( Kishan reddy ) ఇతర ఎంపీలు పార్టీ సమావేశంలో భాగంగా ఆయనతో భేటి కానున్నారు. తెలంగాణ రాజకీయాలు, వరిధాన్యం కొనుగోలుపై సీఎం కేసిఆర్ రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణల అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు బీజేపీ నేతలు టీఆర్ఎస్ బృందం కంటే ముందుగానే మంత్రి పీయూష్ గోయల్‌తో అనుహ్యా సమావేశం అయ్యారు... దీంతో టీఆర్ఎస్ నేతలు డిమాండ్ అంశాలతో పాటు పార్టీ స్టాండ్‌పై చర్చించనున్నారు. ఇక టీఆర్ఎస్ ( TRS leaders ) బృందం కంటే బీజేపి నేతలకు ముందుగానే అపాయింట్మెంట్ ఇవ్వడంతో రాజకీయం మరింత హీట్ ఎక్కింది.
మొత్తం మీద ఢిల్లీలో రెండు పార్టీల నేతలు మోహరించడంతో ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణ నుండి ఢిల్లీని తాకింది. అయితే ఈ రెండు పార్టీల భేటి తర్వాత అటు టీఆర్ఎస్ నేతలకు, సొంత పార్టీ నేతలకు ఎలాంటీ హామి ఇస్తారనేది హాట్ టాపిక్ మారింది. టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా అధికారింగా కొనుగోలుకు హామి ఇస్తారా లేక రాజకీయ కోణంలో దానికి ఫుల్స్టాప్ పెడతారా అనేది సాయంత్రం వరకు తేలనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.