Oxygen supply : మంత్రి అజయ్ చొరవతో ఐటిసీ నుండి ఆక్సిజన్ సప్లై

మంత్రి అజయ్ చొరవతో ఐటిసీ నుండి ఆక్సిజన్ సప్లై

Oxygen supply : మంత్రి అజయ్ కుమార్ చొరవతో జిల్లాలోని ఐటిసి నుండి రోజు ఆక్సిజన్ సరఫరాకు మార్గం సుగమమైంది. ఐటీసీ నుంచి ఐదు మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఖమ్మంలోని ఆసుపత్రులకు సరఫరా కానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా

  • Share this:
కరోనాతో నిత్యం ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే..ముఖ్యంగా ఆక్సిజన్ అందుబాటులో ఉన్న దాని రవాణాకు ఎక్కువ సమయం పడుతోంది. ఇలా దూర ప్రాంతాల నుండి ఆక్సిజన్ సరఫరాతో ఇటివల ఆటు ఏపీ ఇటు తెలంగాణలో సైతం చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులు ప్రాణాలు విడిచారు.

దీంతో ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవ చూపించారు. .ఐటీసీ నుంచి ఐదు మెట్రిక్‌ టన్నుల ప్రాణవాయువు సరఫరా కోసం చర్యలు చేపట్టారు. ఇందు కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలం సారపాకలో ఉన్న ఐటీసీ పీఎస్‌పీడీ పేపర్‌ మిల్లులో నిత్యం ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంది. దీంతో మంత్రి అజయ్‌కుమార్‌ ఐటీసీ యాజమాన్యంతో చర్చించారు. ఇక్కడి నుంచి ఆక్సిజన్‌ను తరలించడానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఓ ప్రత్యేక ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్యాంకర్‌ నిత్యం ఐటీసీ ఫ్యాక్టరిలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ నింపుకుని.. నేరుగా ఖమ్మం చేరుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్‌తో సహా.. ప్రవేటు ఆసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్‌ను సైతం నింపుతుంది.

దీంతో హైదరాబాద్‌ నుంచి సరఫరా అవసరం పూర్తి స్థాయిలో తగ్గిపోనుంది. ఇలా హైదరాబాద్‌ నుంచి ఖమ్మం పూర్వపు జిల్లాకు గతంలో చేస్తున్న ఆక్సిజన్‌ సరఫరాను అవసరమైన ఇతర ప్రదేశాలకు మళ్లించే వెసులుబాటు కలగనుంది. దీనికితోడు సరఫరా ఖర్చులు పూర్తి స్థాయిలో తగ్గిపోనున్నాయి. ఖమ్మంలో ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో 320 కోవిడ్‌ ప్రత్యేక బెడ్లు ఉండగా.. వందల సంఖ్యలో ఆక్సిజన్‌ బెడ్లు.. 80 ఐసీయూ బెడ్లు.. ఇంకా ప్రవేటు రంగంలో 1300 మేర కోవిడ్‌ బెడ్లు.. ఇంకా వందల సంఖ్యలో ఐసోలేషన్‌ సెంటర్ల బెడ్లు ఉన్నాయి.

ఆక్సిజన్‌కు డిమాండ్‌ రావడంతో ప్రభుత్వం తరపున అవసరమైన ఏర్పాట్లు చేసినా.. తానుగా వ్యక్తిగతంగా చొరవ తీసుకుని మంత్రి అజయ్‌కుమార్‌ ఐదు మెట్రిక్‌ టన్నుల కెపాసిటీ కలిగిన ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు. ఇక నుంచి నిత్యం ఐదు మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఈ ట్యాంకర్‌ సరఫరా చేయనుంది. దీంతో నిత్యం ఇక్కడకు వచ్చి వైద్య సేవలు పొందే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యపేట జిల్లాల ప్రజలతో బాటు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల ప్రజలకు ప్రాణవాయువు అందుబాటులోకి రానుంది.
Published by:yveerash yveerash
First published: