హోమ్ /వార్తలు /తెలంగాణ /

Oxygen : ఆక్సిజన్ కొరతను అధిగమించిన మహబుబ్‌నగర్

Oxygen : ఆక్సిజన్ కొరతను అధిగమించిన మహబుబ్‌నగర్

ముందు జాగ్రత్త చర్యలతో ఆక్సిజన్ కొరతను అధిగమించిన  ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లా ,కొవిడ్ 
రోగులకు ఆక్సిజన్ అంతరాయం లేకుండా చర్యలు

ముందు జాగ్రత్త చర్యలతో ఆక్సిజన్ కొరతను అధిగమించిన ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లా ,కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అంతరాయం లేకుండా చర్యలు

Oxygen : ముందు జాగ్రత్త చర్యలతో ఆక్సిజన్ కొరతను అధిగమించిన ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లా ,కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అంతరాయం లేకుండా చర్యలు

కరోనా నుండి కోలుకునేందుకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దీని కోసం దేశ వ్యాప్తంగా ఎదురుచూపులు చూస్తున్నారు. ముఖ్యంగా ఆక్సిజన్ లేక కరోనా రోగులు చనిపోవడం ప్రభుత్వాలను ఇరుకున పెడుతున్నాయి. దీంతో విదేశాల్లో ఆక్సిజన్ దిగుమతి చేసుకుని ఆయా రాష్ట్రాలకు సప్లై చేస్తున్న పరిస్థితి.

అయితే ఆక్సిజన్, ప్లాంట్స్‌ నుండి స్థానిక ఆసుపత్రులకు చేరాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తున్న

విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే తెలంగాణకు ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుండి ఆక్సిజన్ కేటాయించారు.

దీంతో ఆక్సిజన్ సరఫరాకు ఆరు రోజుల సమయం పడుతుంది. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం

ప్రత్యమ్నాయలపై దృష్టి సారించింది. ఆక్సిజన్ ప్లాంట్లను ఆయా జిల్లా ఆసుపత్రుల కేంద్రాల్లో ప్లాంట్స్ ను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ఏ జిల్లాల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు ప్రత్యేక కమిటీలను సైతం నియమించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ప్రస్తుతం సత్పాలితాలను ఇస్తోంది. పలు జిల్లాలు ఆక్సిజన్ కొరత లేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టడంతో ఆక్సిజన్ అందించే ఇబ్బందులను అధిగమిస్తోందంటున్నారు స్థానిక ఆసుపత్రుల వైద్యులు .

మహబూబ్ నగర్‌లో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేశారు. గత ఏడాది మంత్రి శ్రీనివాస్ గౌడ్ దీన్ని ఏర్పాటు చేయించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నిచోట్ల రోగులకు సరిపడా ప్రాణవాయువు అందుబాటులో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.కోవిడ్ చికిత్స అందించేందుకు ఉమ్మడి జిల్లాలో 2828 పడకలను సిద్ధం చేసినట్టు తెలిపారు. కాగా వీరందరికి ఆక్సిజన్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు.

Published by:yveerash yveerash
First published:

Tags: Mahabubnagar, Oxygen

ఉత్తమ కథలు