హోమ్ /వార్తలు /తెలంగాణ /

Eetala Rajender ; అంతా ఉత్తిదే.. అన్ని అందుబాటులో ఉన్నాయి.. బెడ్ల కోరకు డ్యాష్ బోర్డులు

Eetala Rajender ; అంతా ఉత్తిదే.. అన్ని అందుబాటులో ఉన్నాయి.. బెడ్ల కోరకు డ్యాష్ బోర్డులు

కాగా ఈటల రాజేందర్ 2014 నుండి సోసైటి చైర్మన్ గా కొనసాగారు. కాగా పదిహను రోజుల క్రితమే ఆ పదవికి 

రాజీనామా కూడా చేశారు.

కాగా ఈటల రాజేందర్ 2014 నుండి సోసైటి చైర్మన్ గా కొనసాగారు. కాగా పదిహను రోజుల క్రితమే ఆ పదవికి రాజీనామా కూడా చేశారు.

Nalgonda : కోవిడ్ వ్యాధి పై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.దీంతో ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారని వివరించారు. ఖాలీ బెడ్ల లిస్టును డ్యాష్ బోర్డుల ద్వార తెలుపుతామని ఆయన వెల్లడించారు.

ఇంకా చదవండి ...

కోవిడ్ వ్యాధి పై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తద్వారా ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరహా అసత్య ప్రచారాలతో అమాయక ప్రజలను గందరగోళంలో పడేయకూడదని ఆయన కోరారు.

కరోనా భాదితులకు సరిపడ మందులు ఆక్సిజన్ తోపాటు వైద్యసిబ్బంది కొరత ఉందన్న ప్రచారంలో నిజం లేదని అని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ పై ఎలాంటీ పరిస్తితినైనా ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాలీల వివరాలు తెలిపేందుకు డ్యాష్ బోర్డులు ఏర్పాటు చేస్తామని అన్నారు.

కరోనా వ్యాధి సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపధ్యంలో మంగళవారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో నీ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో కలసి ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులతో పరిస్థితులు సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కోవిడ్ బాధితులకు సరిపోను ఆక్సిజన్ ,ఆయా ఆసుపత్రులలో బెడ్ లు ఉన్నాయని అవసరానికి సరిపడా మందులు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ బారిన పడిన వారితో పాటు ప్రజల్లో మనోధైర్యాన్ని నింపే బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల పై ఉందని ఆయన అన్నారు. ఏ పరిస్తితి నైనా ఎదుర్కునే సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉందన్నారు.ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులన్నింటిని ప్రభుత్వం స్వాధీన పర్చుకుందని ఖాళీల వివరాలు తెలిపేందుకు డ్యాష్ బోర్డుల విధానం ప్రవేశ పెట్టె ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.

మే 1 నుండి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఉదృతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.రోజు వారిగా 10 లక్షల పై చిలుకు మందికి వ్యాక్సిన్ ఇవ్వగల శక్తి సామర్ధ్యాలు వైద్య ఆరోగ్యశాఖ కు ఉన్నాయని ఆయన చెప్పారు.ప్రజారోగ్యానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ప్రజలను కాపాడాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని కట్టడికే రాత్రి పూట కర్ఫ్యూ అని ఆయన తెలిపారు.ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి గాను కర్ఫ్యూ ను విజయవంతం చేయాలని మంత్రి ఈటెల పిలుపునిచ్చారు.

Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Eetala rajender

ఉత్తమ కథలు