తల్లిదండ్రుల మృతి.. అద్దె ఇంట్లో కర్మకాండలకు నో.. ఊరవతల టెంటులో..

సమత, మమతలకు సాయం అందజేస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్

తండ్రికి చేయాల్సిన కర్మకాండలను తమ ఇంట్లో చేయోద్దంటూ ఇంటి యాజమానులు తేల్చిచెప్పారు. దీంతో చేసేదేం లేక ఇద్దరు ఆడపిల్లలు ఊరు బయట టెంట్ వేసుకుని నివాసం ఉంటున్నారు.

 • Share this:
  అది కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామం. ఆ గ్రామంలో వారిది పచ్చని సంసారం. తల్లిదండ్రులు కనకవ్వ, పాపయ్యగౌడ్ .. ఇద్దరు ఆడ పిల్లలు.. సమత, మమత. ఉండేది పూరి గుడిసెలోనైనా తమకున్న దాంట్లోనే కలో గంజో తాగుతూ సాఫీగానే బతుకెళ్లదీస్తున్నారు. వారిని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. తల్లి కనకవ్వ క్షయవ్యాధితో ఎనిమిదేళ్ల క్రితం చనిపోయింది. తండ్రి పాపయ్యగౌడ్ గుండెపోటు మూడు రోజుల క్రితం హఠ్మానరణం చెందాడు. తండ్రి చనిపోవడానికి వారం రోజుల ముందే అకాల వర్షాలకు ఉన్న కొద్దిపాటి గుడిసె కూలిపోయింది. దీంతో తండ్రిని తీసుకుని అక్కాచెల్లెల్లిద్దరూ గ్రామంలోని ఓ ఇంట్లో అద్దెకు చేరారు. అద్దె ఇంట్లోకి చేరిన వారం రోజులకే తండ్రి మరణించడంతో ఇద్దరు ఆడపిల్లలు సమత, మమతలు అనాథలుగా మారి దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

  అసలే లాక్‌డౌన్ కష్టాలు.. ఆపై ఆర్థిక ఇబ్బందులు.. దాతల సాయంతో ఆడపిల్లలిద్దరే తండ్రి అంత్యక్రియలు చేశారు. అయితే తండ్రికి చేయాల్సిన కర్మకాండలను తమ ఇంట్లో చేయోద్దంటూ ఇంటి యాజమానులు తేల్చిచెప్పారు. దీంతో చేసేదేం లేక ఇద్దరు ఆడపిల్లలు ఊరు బయట టెంట్ వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలుసుకున్నారు. తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన అక్కాచెల్లెలిద్దరినీ అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు.

  లాక్‌డౌన్ పూర్తికాగానే అక్క సమతకు ఉపాధి కల్పిస్తామని మమతకు వివాహం చేస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. తక్షణ సాయం కింద రూ.20వేలు, క్వింటా బియ్యం అందజేశారు. ఇతర దాతలేవరైనా స్పందించి ఇచ్చే డబ్బులు జమ చేసేందుకు బ్యాంకు ఖాతా తెరిపిస్తామని తెలిపారు. సమత, మమతలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. చిన్న అమ్మాయి మమతకు గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించి చదివిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.
  Published by:Narsimha Badhini
  First published: