ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు. ఈ రోజుల్లో వాయు వరసలు మరిచి మరీ ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులు మంచిగా చదువుకొమ్మని కాలేజీలకు పంపిస్తుంటే.. చదువును మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. డిగ్రీ చదువుతున్న ఓ యువతి సొంత చిన్నాన్న కొడుకును ప్రేమించింది. అంతే కాకుండా అతడితో ఆమె వెళ్లిపోయింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని తన చిన్ననాన్న కొడుకుతో ప్రేమలో పడింది. అంతే కాకుండా అతడితో చెట్టాపట్టాలేసుకుని భయట తిరగడం మొదలు పెట్టారు. కరోనా నేపథ్యంలో వేసవి సెలవులు రావడంతో ఇంటి వద్దే ఉంటున్న వీరు ఖాళీ సమయంలో ఇలా బయటకు వెళ్లే వారు.
రెండు రోజుల క్రితం ఆ విద్యార్ధిని ఇంట్లో ఉండగా ఆమె వద్ద తన నానమ్మను సెక్యూరిటీగా పెట్టి ఆమె తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. ముందుగానే ప్లాన్ చేసుకున్న వాళ్లు ఆమె నానమ్మకు అబద్దాలు చెప్పిమామిడితోటను చూసి వస్తానని ఇంట్లో అబద్దం చెప్పి వెళ్లింది. ఎంతకు ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా తన చిన్ననాన్న కొడుకుతో వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక కన్నీరుమన్నీరుగా విలపించారు. మంచి సంబంధం వస్తే చేద్దామనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం టెక్నాలజీ ఎంత వేగంగా వస్తరిస్తుందో అంతే వేగంగా యువత పెడదోవ పడుతున్నారు. మంచి కంటే ఎక్కువగా చెడునే తీసుకుంటున్నారు. ప్రేమించుకోవడం తప్పు కాదు కానీ ఆ ప్రేమను వాయువరసలు లేకుండా చేసుకుంటున్నారు. సొంత వాళ్లనే లవ్ చేస్తూ ఊళ్లో కన్న తల్లిదండ్రుల పరువును తీస్తున్నారు. పరువు కోసం ఎంతటికైనా దిగజారే మనుషులు ఉండగా సొంత అక్కా, తమ్ముడు ప్రేమించుకొని ఎవరకీ చెప్పకుండా పారిపోవడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. తల్లిదండ్రులు పిల్లలను కాలేజీలకు, పాఠశాలకు పంపేటప్పుడు కొంచెం కనిపెట్టుకుంటూ ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయని పోలీసులు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brother and sister fall in love, Medak, Ralation love story, Sister love, Telangana crime news