హోమ్ /వార్తలు /తెలంగాణ /

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ స్టూడెంట్ ఫ్యామిలీకి కోటి పరిహారం ఇవ్వాలి .. నేడు అన్నీ యూనివర్సిటీలు బంద్‌ : OU JAC

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ స్టూడెంట్ ఫ్యామిలీకి కోటి పరిహారం ఇవ్వాలి .. నేడు అన్నీ యూనివర్సిటీలు బంద్‌ : OU JAC

(BASARA IIIT STUDENTS)

(BASARA IIIT STUDENTS)

Basara iiit:తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీల బంద్‌కు ఓయూజేఏసీ పిలుపునిచ్చింది. స్టూడెంట్ మృతికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని బాధ్యురాలిగా చేస్తూ ఆమె రాజీనామాకు పట్టుబట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Nirmal, India

నిర్మల్(Nirmal)జిల్లా బాసర(Basara)ట్రిపుల్‌ ఐటీ హాస్టల్‌లో మూడ్రోజుల క్రితం ఇంజినీరింగ్‌ ఫస్ట్ ఈయర్ స్టూడెంట్ సురేష్ (Suresh)సూసైడ్ చేసుకున్నాడు. అయితే అతని మృతికి కారణాలు తెలియజేయాలంటూ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ట్రిపుల్‌ ఐటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే స్టూడెంట్ చనిపోయాడని ఆరోపిస్తూ గురువారం తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీల బంద్‌(Universities Bandh)కు ఓయూజేఏసీ(OUJAC) పిలుపునిచ్చింది. స్టూడెంట్ మృతికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి(Sabita Indra Reddy)ని బాధ్యురాలిగా చేస్తూ ఆమె రాజీనామాకు పట్టుబట్టింది ఏయూజేఏసీ. అలాగే మృతుని కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధి సంఘాల నాయకులు.


Hyderabad: గ్రేటర్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ వార్నింగ్ .. ఇప్పటి నుంచి అలా చేస్తే ఫైన్ కట్టాల్సిందేపర్సిటీల బంద్‌కు పిలుపు ..
బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. మంగళవారం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ సురేష్ హాస్టల్ రూమ్‌లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సురేశ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేయకపోవడంపై ఐఐఐటీ విద్యార్థులు డైరెక్టర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకు దిగి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వాహనం అద్దాలను ధ్వంసం చేశారు.విచారణ జరుగుతోంది..

సురేష్ క్యాంపస్‌లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, సురేశ్ ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడో విచారణలో వెల్లడిస్తామని డీఎస్పీ ఒక ప్రశ్నకు తెలిపారు.


Agent fraud : వరినాట్లు వేసేందుకు వచ్చిన కూలీలను వదలని బ్రోకర్ .. ఎలా మోసం చేశాడంటేమంత్రి రాజీనామాకు పట్టు..

ట్రిపుల్‌ ఐటీలో స్టూడెంట్ చనిపోయిన రెండ్రోజులు గడిచినప్పటికి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఈఘటనపై మంత్రి స్పందించకపోవడాన్ని విద్యార్ధి సంఘాలు తప్పు పడుతున్నాయి. దీనికి కొనసాగింపుగానే ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఓయూజేఏసీ) తెలంగాణలోని యూనివర్సిటీల బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యార్థి సురేష్‌ మృతికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బాధ్యులను చేసి ఆమె రాజీనామా చేయాలని ఓయూజేఏసీ కోరింది. మృతుల కుటుంబాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Basara IIIT, Telangana News

ఉత్తమ కథలు