• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • OSMANIA UNIVERSITY ELDERS OF CENTRAL AND STATE GOVERNMENTS BEHIND LAND ENCROACHMENTS BN

ప్రభుత్వ పెద్దల అండతోనే భూముల కబ్జా.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ పెద్దల అండతోనే భూముల కబ్జా.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు

ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ (ప్రతీకాత్మక చిత్రం)

ఉస్మానియా యూనివర్సిటీ భూమలు ఆక్రమణ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తులసి కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలోనూ భూముల కబ్జా చేస్తున్నారని, కేంద్ర సర్వే డిపార్ట్‌మెంట్‌తో భూములు సర్వే చేయించాలని కోరినట్టు చెప్పారు.

  • Share this:
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పెద్దల అండతోనే ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. సోమవారం రాజ్‌భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ భూమలు ఆక్రమణ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తులసి కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలోనూ భూముల కబ్జా చేస్తున్నారని, కేంద్ర సర్వే డిపార్ట్‌మెంట్‌తో భూములు సర్వే చేయించాలని కోరినట్టు చెప్పారు. మా వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందన్నారు.

    యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకుండా ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతుందని తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీలు లేకుంటే పేదలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వ యూనివర్సిటీల రక్షణ కోసం గవర్నర్‌కి విజ్ఞప్తి చేశామని, గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు