Home /News /telangana /

OSMANIA UNIVERSITY DENIES PERMISSION FOR RAHUL GANDHI VISIT ON MAY 7 CONGRESS SLAMS TRS CM KCR MKS

Rahul Gandhi | OU: ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరణ -KCR భయపడ్డారంటూ..

రాహుల్ సభకు ఓయూ నిరాకరణ

రాహుల్ సభకు ఓయూ నిరాకరణ

రాహుల్ గాంధీ సభకు అనుమతివ్వాలంటూ తెలంగాణ కాంగ్రెస్ చేసిన విన్నపాన్ని ఉస్మానియా వర్సిటీ తిరస్కరించింది. ఇకపై క్యాంపస్ లో ఎలాంటి రాజకీయ సమావేశాలకు చోటులేదని, కెమెరాలనూ అనుమతించబోమని ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ స్పష్టం చేసింది.

కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా తలపెట్టిన ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనకు అనుమతి లభించలేదు. ఓయూలో రాహుల్ సభకు అనుమతివ్వాలంటూ తెలంగాణ కాంగ్రెస్ చేసిన విన్నపాన్ని ఉస్మానియా వర్సిటీ తిరస్కరించింది. రాహుల్‌ సభకు అనుమతివ్వరాదని ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై నిరుద్యోగ జేఏసీ, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఓయూ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జేఏసీ కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి..

తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దరిమిలా విపక్ష కాంగ్రెస్ రాజకీయ కార్యక్రమాలను ఉధృతం చేసింది. కేసీఆర్ సర్కారుపై పోరులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ఈనెల 6వ తేదీన వరంగల్ వేదికగా ‘రైతు సంఘర్షణ సభ’ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆ మరుసటి రోజు(మే 7న) హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సి ఉంది.

Petrol Diesel బంపర్ ఛాన్స్: తక్కువ సమయంలో భారీ లాభాలు పొందే Business Idea ఇది..


ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద రాహుల్‌గాంధీ.. విద్యార్థులతో మమేకం అవుతారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఇదివరకే తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలోని బృందం.. ఓయూ వీసీ, ఇతర అధికారులను కలిసి అనుమతి కోరింది. రాహుల్ సభకు అనుమతి ఇవ్వొద్దంటూ టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘాలు ఓయూ వీసీని కలిశాయి. చివరికి సదరు సభకు అనుమతి నిరాకరిస్తూ ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ శనివారం నిర్ణయం తీసుకుంది.

PM Kisan: రైతులకు డబుల్ బొనాంజా? భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు తీసుకోవచ్చా? నిబంధనలివే..


రాహుల్ సభకు అనుమతి నిరాకరణతోపాటే ఓయూ కౌన్సిల్ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి ఓయూ ప్రాంగణంలో ఎటువంటి రాజకీయ సమావేశాలు - సభ లకు అనుమతి లేదని స్పష్టం చేసింది. వర్సిటీ ప్రాంగణంలోకి కెమేరాలను సైం అనుమతించమని తేల్చి చెప్పింది. దీని పైన కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీకి వెళ్లేందుకు ఎవరికైన అధికారం ఉంటుందని.. విద్యార్ధుల కష్టాలు తెలుసుకోవటానికి మాత్రమే రాహుల్ యూనివర్సిటీకి వస్తున్నారని చెబుతున్నారు.

KCR అనూహ్య వ్యూహం? మోదీ సీటుకు స్పాట్ పెట్టారా? -బీజేపీలో ఏకైక మంచి మనిషి ఆయనే!!


రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే.. నిరుద్యోగ యువతకు టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ చేసిన అన్యాయం పైన మాట్లాడుతారనే భయంతోనే వర్సిటీ పాలకవర్గం పై అధికార పార్టీ ఒత్తిడి తెచ్చిందని, కేసీఆర్ భయపడుతున్నట్లు స్పస్టంగా తెలుస్తోందని నిరుద్యోగ జేఏసీ ఆరోపిస్తోంది. ఇదే అంశం పైన ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

KTR దుమారం వేళ కేంద్రం సంచలనం.. KCR పాలనకు కితాబు.. అమెరికాకు దీటుగా తెలంగాణ: గడ్కరీ


ఓయూ పాలకమండలి రాహుల్ సభకు అనుమతి నిరాకరించడంతో ఈ కార్యక్రమంపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పైన టీపీసీసీ నిర్ణయం తీసుకోనుంది. నిరుద్యోగ జేఏసీ కోర్టు వేసిన పిటీషన్ పైన తీర్పు వచ్చే వరకు వేడి చూడటమా..లేక, తామే కోర్టుకు వెళ్లి అనుమతి కోరటమా అనే అంశంపై టీపీసీసీ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఉస్మానియా యూనివర్సిటీ వెలుపలైనా విద్యార్థులతో రాహుల్ సమావేశాన్ని ఏర్పాటుచేసే దిశగానూ టీకాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Congress, Hyderabad, Osmania University, Rahul Gandhi, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు