Hydrabad : రాష్ట్రంలోని అనాథ పిల్లలకు సెల్‌ఫోన్లు...వారికి మరింత చేయూత...!

Hyderabad : రాష్ట్రంలోని అనాథ పిల్లలకు సెల్‌ఫోన్లు...వారికి మరింత చేయూత...! (ప్రతీకాత్మక చిత్రం

Hyderabad : కోవిడ్ భారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన ఆనాధ పిల్లలకు అన్ని రకాల తోడుగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.వారికి ఎలాంటీ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్ ఇవ్వాలని రాష్ట్ర శిశు సంక్షేమ అధికారులు నిర్ణయించారు.

  • Share this:
    గత రెండు సంవత్సరాలు కరోనా మహామ్మారి అనేక మందిని తీసుకువెళ్లిన విషయం తెలిసిందే..అయితే దీని భారిన పడి కుటుంబాలకు కుటుంబాలే ప్రాణాలు కోల్పోయి..చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులిద్దరిని కోల్పోయినవారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు.. తల్లిదండ్రులను కోల్పోయిన వారిని బాగోగులు చూసేందుకు ఎవ్వరు ముందుకు రాని పరిస్థిలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ముందుకు వచ్చింది. వారిని తమ ఆశ్రమాల్లోకి తీసుకుని సంరక్షిస్తోంది..

    ఇలా కేవలం హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా తమ తల్లిదండ్రులను కోల్పోయినవారు కొంతమంది రాష్ట్ర శిశు సంక్షేమశాఖ ఆశ్రమంలో ఉంటున్నారు..కాగా మరికొంతమంది తమ బంధువుల వద్ద సంరక్షింపబడుతున్నారు.. ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 138 మంది పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.అయితే వీరందరికి ఎలాంటీ లోటు రాకుండా ఉండడడంతోపాటు వారికి ఎలాంటీ ఇబ్బంది వచ్చినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చేందుకు వారందరికి సెల్ ఫోన్‌లు ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా సంక్షేమశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

    ఆ సెల్‌ఫోన్‌లలో జిల్లాస్థాయి అధికారులతో పాటు ,హెల్ప్‌లైన్ ,ఎమర్జెన్సీ నెంబర్లను ఫీడ్ చేసి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. దీని ద్వారా వారు ఎప్పుడైనా..అధికారులతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు వీరికి నెలవారి రేషన్, సరుకులు అందించేందుకు స్వచ్ఛంధ సేవ సంస్థల సహాకారం తీసుకోనున్నారు. స్కూళ్లు ప్రారంభం అయిన తర్వాత అందరని రెసిడేన్సియల్ స్కూళ్లలో చేర్పించేందుకు కరోనా మహమ్మారిన పడి తల్లితండ్రులను కోల్పోయిన చాలా మంది పిల్లలు అనాథలయ్యారు..దీంతో వారి భాద్యత అంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది..ఇలా కోవిడ్ భారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన వారికి మరింత చేయుత నివ్వడం ద్వార వాళ్లు నిర్బయంగా బ్రతకగలరనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు.
    Published by:yveerash yveerash
    First published: