Agriculture News: నాట్లు వేస్తున్న ఒరిస్సా యువకులు.. వారికి విపరీతంగా పెరిగిన డిమాండ్.. ఎందుకో తెలుసా..

వరి నాట్లు వేస్తున్న ఒరిస్సా కూలీలు

Agriculture News: నాలుగు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా వర్షం కురుస్తోంది. దీంతో రైతన్నలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వరి నాటు వేయడానికి కనీసం కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. అంతగా తమ సొంత పొలాల్లో పనులు చేస్తూ బిజీబిజీ అయ్యారు. అయితే ఒరిస్సా యువకులు అతి తక్కువ ధరకే వరి నాట్లు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

  • Share this:
    (కె.వీరన్న, మెదక్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

    నాలుగు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా వర్షం కురుస్తోంది. దీంతో రైతన్నలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వరి నాటు వేయడానికి కనీసం కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. అంతగా తమ సొంత పొలాల్లో పనులు చేస్తూ బిజీబిజీ అయ్యారు. అయితే ఒరిస్సా యువకులు అతి తక్కువ ధరకే వరి నాట్లు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రైతుల వద్దనుండి వాళ్లు ఎకరానికి 3,800 రూపాయలు తీసుకుంటూ పొలంలో నాట్లు వేస్తున్నారు. ఒక రైతు వద్ద ఎంత పొలం ఉంటే అంత పొలం వేసేదాక వాళ్లు దానిని వదిలిపెట్టరు. అయితే నాట్లు అయిపోయే వరకు తాము సంగారెడ్డిలోనే ఉంటామని చెబుతున్నారు. మాకు తినడానికి వరినాటు వేయించే రైతు కాస్త బియ్యం పెడితే చాలు అంటూ చెబుతున్నారు. ముఖ్యంగా వాన జోరు ఎక్కువగా కావడంతో సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో ఎక్కువగా పొలం పనులు మొదలయ్యాయి. దీంతో ఆ కూలీలు ఇక్కడే ఉంటూ పనులను చేస్తున్నారు.

    హత్నూర మండలంలో ప్రతీ గ్రామం తిరుగుతూ ఎవరి పొలంలో నాట్లు వేయాలో అడుగుతూ పని కుదుర్చుకుంటున్నారు. కూలీల కొరత కారణంగా మాకు ఈ అవకాశం వచ్చిందని వాళ్లు చెప్పారు. ఇప్పుడు ఒరిస్సా కూలీలు రావడంతో రైతులకు కూడా సమయం కలిసి రావడంతో పాటు తక్కువ ధరలకు నాట్లు వేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒరిస్సా కూలీలు ఒక్క గ్రూప్ కు 20 మంది వరకు ఉంటారు. రోజు వారు 5ఎకరాల నుండి 10 ఎకరాల వరకు నాట్లు వేస్తామని చెప్పారు. మిరప చెట్లకు లైన్లు ఎలా వేస్తారో అలా లైన్ల మాదిరిగా నాట్లు వేస్తున్నారు ఒరిస్సా కూలీలు. వరి వేసేందుకు తుకం పీకోని గుంట గుంట కు నారు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఒరిస్సా కూలీలు. సాధారణంగా మహిళలు ఎకరం పొలం నాట్లు వేస్తే రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు తీసుకుంటారు. కానీ ఈ కూలీలు ఎకరానికి రూ.3 వేలు మాత్రమే తీసుకుంటుడటంతో వీళ్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.

    మెదక్ జిల్లా లో చిలిప్ చెడ్ మండలం చండుర్ గ్రామంలో కుమ్మరి బేతయ్య అనే రైతు 50ఎకరాల పొలంలో  ఒరిస్సా కూలీలు రావడం వల్ల వరి నాటు తక్కువ ఖర్చు అయిందని సంతోషం వ్యక్తం చేశాడు. గత సంవత్సరం ఎకరాకు 20 వేల రూపాయలు అయితే ఇప్పుడు 15 వేల రూపాయలు ఖర్చు అయిందన్నాడు. కొల్చారం మండలంలో  పైతర రంగంపేట్ తదితర గ్రామాలలో ఒరిస్సా కూలీలు రావడంతో ఇప్పటికే 70 శాతం వరి నాట్లు అయిపోయినట్లు తెలుస్తుంది. పుల్కల్ మండలం ముద్దయిపేట్ లో లక్ష్మణ్ అనే రైతు 25 ఎకరాలు వరి నాట్లు సాగు చేస్తున్నాడు. మొదట ఒక మహిళ కూలికి ఒక్కరోజు 1700 రూపాయలు చెల్లించి నాటు వేసుకున్నాడు. వీరి రాకతో తక్కువ ఖర్చుతో వరి నాట్లు వేసే వీలు కలిగిందని తెలిపాడు.
    Published by:Veera Babu
    First published: