Kishan Reddy: మూడు వారాల్లో బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభం.. ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Bibinagar AIIMS: బీబీనగర్ ఎయిమ్స్‌లో 200 ఎకరాలకుగాను మొదట నలభై తొమ్మిది, ఆ తర్వాత ఇటీవలే మిగిలిన ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు.

news18-telugu
Updated: October 10, 2020, 5:57 PM IST
Kishan Reddy: మూడు వారాల్లో బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభం.. ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ రియల్ యాక్టివిటీ త్వరలోనే ప్రారంభమవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూడు వారాల్లో ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సుమారు వెయ్యి కోట్లు నిధులతో కేంద్రం నిర్మిస్తున్న ఈ ఆస్పత్రిలో 750 మంది స్టూడెంట్స్, 200 మంది పారమెడికల్ స్టాఫ్, 300 పీజీ స్టూడెంట్స్, 300 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, 800 మంది నర్సింగ్ స్టాఫ్ ఇంకా ఆయుష్ విభాగం ఇందులో పని చేయనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. కోవిడ్‌తో పాటు క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఇక్కడ రీసెర్చ్‌లో పాటు మెరుగైన వైద్య సహాయం అందుతుందని తెలిపారు.

బీబీనగర్ ఎయిమ్స్‌లో మెడికల్ ,నర్సింగ్, పారామెడికల్, లెక్చరర్ థియేటర్స్, ఫ్యాకల్టీ రీసెర్చ్ ల్యాబ్, హాస్టల్స్, ఆయుష్ ఇలా అన్ని విభాగాలు ఒకే చోట ఏర్పాటు అవుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్‌కు పూర్తిగా సహకరిస్తే త్వరితగతిన దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. వెంటనే ఎయిమ్స్ కు సంబంధించి రిక్రూట్మెంట్, యాక్టివిటీ, ఎక్విప్మెంట్ పై యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని, త్వరితగతిన ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కేంద్రం కూడా తన వంతు ప్రయత్నం చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు.

బీబీనగర్ ఎయిమ్స్‌లో 200 ఎకరాలకుగాను మొదట నలభై తొమ్మిది, ఆ తర్వాత ఇటీవలే మిగిలిన ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. తాను వస్తున్నానని తెలిసి.. వారం రోజుల క్రితం బిల్డింగ్‌ను ఎయిమ్స్‌కు కేటాయించిందని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భౌతికంగా బిల్డింగ్‌ అప్పగించినా.. డాక్యుమెంట్ రూపంలో త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ అధికారులను కిషన్ రెడ్డి కోరారు. గత ఏడాది 50 సీట్లతో కాలేజీ ప్రారంభించుకున్న ఎయిమ్స్, ఈసారి 63 స్టూడెంట్స్‌కు వైద్య విద్యను అందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.
Published by: Kishore Akkaladevi
First published: October 10, 2020, 5:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading