5 రోజుల్లో టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవం... మంత్రి ఈటల ప్రకటన

ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తక్కువ సమయంలో హెల్త్ రంగంలో అభివృద్ది సాధించామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

  • Share this:
    గచ్చిబౌలిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిమ్స్(తెలంగాణ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రిని 4-5 రోజుల్లో ప్రారంభిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటికే గచ్చిబౌలిలో ఓపీ సేవలు నడుస్తున్నాయని ఆయన తెలిపారు. టిమ్స్ ఆస్పత్రిని అధికారులతో కలిసి మంత్రి ఈటల సందర్శించారు. అత్యంత అధునాతన సౌకర్యాలతో గచ్చిబౌలి ఆసుపత్రి సిద్ధమైందని ఆయన తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులలో లేనన్ని హంగులు ఇక్కడ ఉన్నాయని అన్నారు. ఇంత అత్యాధునికమైన ఆసుపత్రి ఇంకా ఎక్కడా లేదని అన్నారు. టిమ్స్‌లో 1224 బెడ్స్ సామర్ధ్యం ఉండగా.. 1000 బెడ్స్‌కి ఆక్సిజన్, 50 బెడ్స్‌కి వెంటిలేటర్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

    టిమ్స్ ఆస్పత్రిలో 15 ఫ్లోర్లు సిద్ధమయ్యాయని అన్నారు. క్యాంటీన్ ఇక్కడే ఉంటుందని... పేషంట్లకు ఇక్కడే భోజనం సిద్ధం చేస్తామని అన్నారు. రెండు రోజుల్లో స్టాఫ్ రిక్రూట్ అయిపోతుందని మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తక్కువ సమయంలో హెల్త్ రంగంలో అభివృద్ది సాధించామని అన్నారు. గాంధీలో వేలాది మందికి వైద్యం అందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తుందని..పేదల ప్రాణాలు కాపాడుతున్న హాస్పిటల్ గాంధీ. అక్కడ పని చేస్తున్న డాక్టర్స్, సిబ్బంది మనో స్థైర్యం దెబ్బతీయవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో కామెంట్లు పేషెంట్లకు నష్టం చేస్తాయని అన్నారు.
    First published: