తెలంగాణను వణికిస్తున్న డెంగ్యూ... ఆస్పత్రుల్లో 24 గంటలపాటు అవుట్ పేషెంట్

గాంధీ ఆస్పత్రి

రోగులకు సరైయన సకాలంలో వైద్యం అందించాలని అక్కడ సిబ్బందికి సూచించారు. డెంగ్యూ కేసుల నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో 24 గంటలపాటు అవుట్ పేషెంట్ విభాగం పనిచేస్తుందని తెలిపారు ఈటల.

  • Share this:
    తెలంగాణ రాష్ట్రాన్ని గతకొన్ని రోజులుగా విష జ్వరాలు వణికిస్తున్నాయి. రోజురోజుకు డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపత్యంలో హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిని సందర్శించారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్. ఆస్పత్రిలో రోగుల్ని . ఆస్పత్రిలో రోగులకు అందుతున్న చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు సరైయన సకాలంలో వైద్యం అందించాలని అక్కడ సిబ్బందికి సూచించారు. డెంగ్యూ కేసుల నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో 24 గంటలపాటు అవుట్ పేషెంట్ విభాగం పనిచేస్తుందని తెలిపారు.

    డెంగ్యూ కేసుల్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఉస్మానియా, గాంధీతో పాటు పలు ఆస్పత్రుల్లో సెలవు రోజుల్లో కూడా 24 గంటలపాటు అవుట్ పేషెంట్ విభాగాలు పనిచేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. డెంగ్యూకు సంబంధించిన పరీక్షలు కూడా పూర్తి ఉచితంగా చేస్తున్నామన్నారు. వ్యాధిపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చెరువులపై డ్రోన్ల సాయంతో దోమల నివారణకు మందులు చల్లుతున్నామన్నారు.15 రోజులకొకసారి అన్ని స్కూళ్లలో దోమల నివారణకు మందులు కొడుతున్నామన్నారు ఈటెల. దీంతోపాటు  జీహెచ్ఎంసీ కూడా దోమన నియంత్రణ, పారిశుధ్యంపై ప్రతీరోజు సమీక్షలు నిర్వహిస్తుందన్నారు.

    మరోవైపు డాక్టర్లు కూడా విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. తీవ్ర జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, తలనొప్పులు మూడురోజులకు మించి ఉంటే .. వెంటనే డాక్టర్లను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు.
    First published: