హోమ్ /వార్తలు /తెలంగాణ /

Corona Vaccine : వ్యాక్సిన్ వేసుకున్నవారికే.. వన దేవతల దర్శనం...! సమ్మక్క జాతరపై అలర్ట్

Corona Vaccine : వ్యాక్సిన్ వేసుకున్నవారికే.. వన దేవతల దర్శనం...! సమ్మక్క జాతరపై అలర్ట్

దేశంలో కవిడ్ టీకాల పంపిణీ కొనసాగుతున్నది. నిన్న 19.13 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 187 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసులు ఎక్కువగా వస్తోన్న రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు చేసింది.

దేశంలో కవిడ్ టీకాల పంపిణీ కొనసాగుతున్నది. నిన్న 19.13 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 187 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసులు ఎక్కువగా వస్తోన్న రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు చేసింది.

Corona Vaccine : తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన గిరిజన జాతర సమ్మక్క, సారక్కలను దర్శించుకునే వారు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుందని జిల్లా వైద్యాధికారులు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకోని వారికి దర్శనం ఉండదని చెప్పారు.

ఇంకా చదవండి ...

  ములుగు జిల్లాలోని ( Mulugu ) సమ్మక్క, సారక్కల జాతరకు వైద్యాధికారులు నిబంధనలు విధించారు. వన దేవతలను దర్శించుకునే తప్పకుండా వ్యాక్సిన్ ( Vaccine )వేసుకోవాలని చెప్పారు. దర్శనానికి వచ్చేవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించిన తర్వాతే అనుమతి ఇస్తామని చెప్పారు. మరో రెండు నెలల్లో జాతర జరగనున్న నేపథ్యంలోనే ఇప్పటి నుండే లక్షల మంది భక్తులు వన దేవతను దర్శించుకునేందుకు వెళ్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ ( Telangana ) జిల్లాల నుండే కాకుండా ఆంధ్ర, చత్తీస్ గడ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్ల దర్శనానికి వస్తుంటారు. ఈ సంధర్భంలోనే కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో వనదేవతలను దర్శించుకునే వారికి ప్రత్యేకంగా జిల్లా వైద్యాధికారులు కోవిడ్ టెస్ట్ లు చేస్తున్నారు. అలాగే టీకా తీసుకోనికి వారి టీకా వేయడం, ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి సెకండ్ డోస్ ఇవ్వడం, రెండు డోసులు తీసుకున్నవారు సర్టిఫికెట్ చూపిస్తేనే దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.

  రానున్న ఫిబ్రవరిలో లక్షలమంది భక్తులు మూడు రోజుల పాటు అక్కడే ఉండి దర్శనం చేసుకుంటారు. దీంతో అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెళ్లడించారు. జాతర సంధర్భంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలు చూపిస్తేనే అధికారులు అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు.

  Bandi sanjay : బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి... టీఆర్ఎస్‌ పని అయిపోయింది...!


  Asaduddin Owaisi : భారత్ కేవలం హిందువులదే కాదు... అందరిది... రాహుల్ వ్యాఖ్యలపై కౌంటర్


  ముఖ్యంగా జాతరకు ప్రతి ఆదివారం వేల సంఖ్యలో భక్తులు ఆయా జిల్లాల నుండి వస్తుంటారు.దీంతో ఒమిక్రాన్ వ్యాప్తి,తో పాటు ఒకేసారి లక్షల మంది ఒక చోట చేరడంతో మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. అయితే సుమారు కోటి జనాభ చేరుకునే మహా కుంభమేళ లాంటీ జాతరలో అధికారులు ఎలాంటీ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

  Telangana news : గోనే ప్రకాశ్ రావు క్షమాపణలు చెప్పాలని.. ఉద్యోగుల జేఏసి.. డిమాండ్..!  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Covid vaccine, Warangal

  ఉత్తమ కథలు