హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్‌లో మద్యం డోర్ డెలివరీ.. బగ్గా వైన్స్‌ పేరుతో బురిడీ

హైదరాబాద్‌లో మద్యం డోర్ డెలివరీ.. బగ్గా వైన్స్‌ పేరుతో బురిడీ

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

అరగంటలోనే ఇంటికొస్తుందని వారు చెప్పిన మద్యం.. రెండు రోజులైనా రాలేదు. చివరకు తాను మోసపోయానని భావించిన బాధితుడు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు

  లాక్‌డౌన్‌తో మద్యం ప్రియులు విలవిల్లాడుతున్నారు. చుక్క మద్యం లేక అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌లో వేలకు వేలు పోసి బాటిల్స్ కొంటున్నారు. అంత డబ్బు పెట్టలేని సామాన్య మందు బాబులు.. పిచ్చెక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వైన్స్ ఫాపులు తెరుచుకుంటాయా? అని ఎదురుచూస్తున్నారు. మద్యం ప్రియుల దాహాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు ఆన్‌లైన్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుంటే.. మందును ఇంటికే పంపిస్తామంటూ బురిడీకొట్టిస్తున్నారు. హైదరాబాద్‌లో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. బగ్గా వైన్స్ పేరుతో ఓ వ్యక్తిని నిండా ముంచేశారు ఆన్‌లైన్ కేటుగాళ్లు.

  గౌలిపురాకు చెందిన రాహుల్ అనే వ్యక్తికి ఇటీవలే ఓ మెసేజ్ వచ్చింది. ఆల్కహాల్‌ను బ్లాక్‌లో అమ్ముతున్నామని.. డబ్బులు పంపిస్తే ఇంటికే బాటిళ్లను డెలివరీ చేస్తామని దాని సారంశం. ఆ మెసేజ్ చూసి టెంప్టైన రాహుల్.. మద్యం కోసం వారిని సంప్రదించాడు. బగ్గా వైన్స్‌ పేరుతో క్యూఆర్‌ కోడ్ పంపించి దానికి నగదు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే అరగంటలో మద్యం ఇంటికే పంపిస్తాంటూ చెప్పారు. అది నిజమేనని భావించి వారికి ఆన్‌లైన్‌లో రూ.51వేలు పంపించాడు రాహుల్. అరగంటలోనే ఇంటికొస్తుందని వారు చెప్పిన మద్యం.. రెండు రోజులైనా రాలేదు. చివరకు తాను మోసపోయానని భావించిన బాధితుడు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బగ్గా వైన్స్ పేరుతో కొన్ని రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే బగ్గా వైన్స్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Coronavirus, Hyderabad, Telangana, Wine shops

  ఉత్తమ కథలు