హైదరాబాద్‌లో చవకగా ఉల్లిపాయలు...కేజీ ధర రూ.40 మాత్రమే...ఎక్కడంటే...

సబ్సిడీ ఉల్లిపాయలను మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లలో రూ.40కు కిలో ఉల్లి అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఇతర రైతుబజార్లలో ఉల్లి విక్రయకేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.

news18-telugu
Updated: November 27, 2019, 9:57 PM IST
హైదరాబాద్‌లో చవకగా ఉల్లిపాయలు...కేజీ ధర రూ.40 మాత్రమే...ఎక్కడంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉల్లి ధరలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కిలో ఉల్లిపాయలను కేవలం రూ.40కే విక్రయించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన మహబూబ్ మాన్షన్ లోని ఉల్లి వ్యాపారులు అంగీకరించారు. తెలంగాణ మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి మలక్‌పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్‌లోని ఉల్లి వ్యాపారులతో చర్చలు జరిపారు. కాగా ఈ సబ్సిడీ ఉల్లిపాయలను మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లలో రూ.40కు కిలో ఉల్లి అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఇతర రైతుబజార్లలో ఉల్లి విక్రయకేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో.. కేంద్రం ఇతర దేశాలకు ఎగుమతులను నిలిపివేసి దిగుమతులు చేసుకుంటున్నది. అంతేకాదు దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను కూడా తెలంగాణ రాష్ట్రానికి వాటా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.
Published by: Krishna Adithya
First published: November 27, 2019, 9:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading