Home /News /telangana /

ONE TIGER SKIN SEIZED BY FOREST DEPARTMENT OF ADILABAD DISTRICT

ఇన్నాళ్లూ ఆ పులులను చంపుతున్నది వాళ్లేనా?

Another tiger skin seized in Mancherial district

Another tiger skin seized in Mancherial district

అసలే మన దేశంలో పులుల సంఖ్య తగ్గిపోతోంది. ఉన్నవాటిని జాగ్రత్తగా కాపాడుకుందామంటే... వేటగాళ్లు వాటిని చంపేస్తున్నారు. ఇంతకీ ఈ పులి చర్మం వెనక జరుగుతున్న తంతేంటి? ఈ బిజినెస్ వెనక ఎవరున్నారు?

ఆదిలాబాద్ జిల్లాలో అడవులు ఎక్కువే. అక్కడి ఏజెన్సీ ప్రాంతం ఇచ్చోడలో... నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్ల దగ్గర ఏదో పార్శిల్ ఉంది. ట్రాఫిక్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులకు వాళ్లపై డౌట్ వచ్చింది. ఆ నలుగురినీ ఆపి... ఆ పార్శిల్‌లో ఏముందని అడుగుదామని ప్రయత్నించారు. కానీ... ఎప్పుడైతే ఎన్జీవో సభ్యులు తమవైపు వస్తున్నారని కనిపెట్టారో ఆ నలుగురు వేగంగా పరుగు అందుకున్నారు. అలర్టైన ఎన్టీవో సభ్యులు... ఫారెస్ట్ అధికారులకు కాల్ చేశారు. ఆ నలుగురూ ఎటు పారిపోతున్నారో అటువైపు కాపుకాసిన అధికారులు... నలుగుర్నీ పట్టుకున్నారు. ఆ సంచిలో ఏముంది? అని ప్రశ్నించగా... వాళ్లంతా నీళ్లు నమిలారు. అధికారులు ఆ సంచిని తెరచి చూసి, షాకయ్యారు. ఎందుకంటే అందులో ఉన్నది పులిచర్మం.

పులి చర్మం, వేటగాళ్లు, పులుల మరణాలు, పులుల సంఖ్య, tiger skin, tiger, leopard skin, tiger skins, tiger skin seized in hyderabad, similipal tiger reserve, skin seized, leopard skin seized in similipal tiger reserve, tiger skin in vizag, tiger skin in ap, seized, tiger (animal), breaking news, tiger skin possession arrested, length tiger skin, tiger skin in visakha dist, tiger skin smuggling, possessing tiger skin, tiger skin for leather jackets, tiger, death, tiger fight, tiger (animal), fight to death, tiger vs python, amaravati | tiger death, tiger attacks man, tiger attack lion, tiger vs tiger, tigers, tiger vs lion death fight, tiger vs lion death battle, tiger vs snake fight to death, tiger vs lion, tiger death by electric current, tiger attack cobra snake to death, tiger deaths in madhya pradesh, fight, suspicious death of tiger,
ఆదిలాబాద్‌ అటవీ అధికారులకు దొరికిన పులి చర్మం


నలుగురినీ అరెస్టు చేసిన అధికారులకు... ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంఖ్య తగ్గిపోవడానికి ఇలాంటి వేటగాళ్లే కారణం కావచ్చన్న అనుమానాలు కలిగాయి. వీళ్లంతా వరంగల్, కాగజ్‌నగర్, నిర్మల్ జిల్లాకు చెందినవాళ్లు. పులి చర్మం, గోళ్లకు విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా చైనాలో వాటితో మందులు తయారుచేస్తున్నారు. అందువల్ల అక్రమార్కులు పులి చర్మం కోసం వేటగాళ్లకు డబ్బు ఎరవేస్తున్నారు. ఒక్కో పులి చర్మాన్నీ రూ.10 లక్షలకు అమ్ముతున్నట్లు తెలిసింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇలా పులులను చంపి వేటగాళ్లు.. ఆ చర్మాలను చైనాకు రహస్యమార్గాల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. దీనిపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:


‘ముళ్ల పొదల్లో బంగారం’... 26 గోల్డ్ బిస్కెట్ల వేట... పోలీస్ వర్సెస్ పోలీస్...


TS CET 2019: మే 3 నుంచి ఎంసెట్‌... షెడ్యూల్ విడుదల


పెళ్లింట్లో ‘మంచి దొంగ’... ఎంచక్కా తాళాలతో బీరువా తెరిచి...


First published:

Tags: Save Tigers, Telangana News, Tiger Attack

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు