హోమ్ /వార్తలు /తెలంగాణ /

Love Marriage Effect: మరిది.. వదిన.. ఓ ప్రేమ వివాహం.. చివరకు ఓ నిండు ప్రాణం బలి.. అసలేం జరిగింది..

Love Marriage Effect: మరిది.. వదిన.. ఓ ప్రేమ వివాహం.. చివరకు ఓ నిండు ప్రాణం బలి.. అసలేం జరిగింది..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Love Marriage Effect: ప్రేమ వివాహం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమ వివాహం చేసునకున్న ఓ జంట ఇంటి నుంచి పారిపోయారు. బాధిత కుంటుంబసభ్యులు ఒకరినికొరు వాగ్వాదం చేసుకోగా ఒకరు మరణించారు. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

వారిద్దరు వేరువేరు సామాజిక వర్గానికి చెందిన వారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకన్నారు. కానీ ఇంట్లో చెబితే గొడవలు జరుగుతాయని భావించారు. ఏమి చేయాలో అర్థం కాక ఓ రోజు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో ఎలాగో మన ప్రేమను ఒప్పుకోరని భావించి.. ఇంట్లో నుంచి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. అనుకున్నట్లుగానే ఓ రోజు అర్థరాత్రి ఇద్దరు ఇంట్లో చెప్పకుంటా వెళ్లిపోయారు. వెళ్లిన రోజే పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ విషయం ఊళ్లో ఆ ప్రేమికుల బంధువులకు తెలిసింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య విద్వేషాలు రగిలిపోయాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా ఈ సంఘర్షణలో ఓ నిండు ప్రాణం బలైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఈ విధంగా ఉన్నాయి.

జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలంలోని వెన్నచర్ల గ్రామంలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ఓ ప్రేమజంట ఆదివారం ఊరు నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య విద్వేషాలు రగిలాయి. అమ్మాయి కోసం వెతికిన కుటుంబ సభ్యులు అబ్బాయి అన్న చెన్నయ్య వదిన ఉషపై గొడ్డలి, రోకలిబండతో దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ప్రేమికుడి అన్న భార్య ఉషకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అటునుంచి హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆమె రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఇన్చార్జి డి.ఎస్.పి గిరి ప్రసాద్ గాంధీ నాయక్, ఎస్సై నాగన్న గ్రామానికి చేరుకొని విచారణ నిర్వహించారు.

దాడి చేసిన లింగస్వామి, లక్ష్మయ్య, శాంతమ్మపై హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితులను జైలుకి పంపినట్లు ఎస్ఐ తెలిపారు. దాడి చేసిన లింగస్వామి, లక్ష్మయ్య, శాంతమ్మపై హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితులను జైలుకు పంపినట్లు ఎస్సై తెలిపారు. కాగా, చికిత్స పొందుతున్న ఉష (32) తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలికి కూతురు, కుమారుడు ఉన్నారు. పరిస్థితులు చేజారకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. కాగా గ్రామంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

First published:

Tags: Crime, Crime news, Love, Love marriage, Lovers, Mahabubnagar, Nagarkurnool

ఉత్తమ కథలు