ONE OF KARIMNAGAR DISTRICT MLA HAS ALLEGATIONS OF BRIBE TO GET POLICE POSTINGS VRY KNR
Karimnagar : తూకం ఉంటేనే.. పోలీసు పోస్టింగ్‌లు.. వివాదస్పదంగా మారిన ఎమ్మెల్యే తీరు.. ఎవరా ఎమ్మెల్యే..
ప్రతీకాత్మక చిత్రం
Karimnagar : శాంతిభద్రతల విభాగంలో పోస్టింగులకు ఇష్టమొచ్చినట్టుగా సిఫారసు లేఖలిచ్చిన ఓ ఎమ్మెల్యే .. లక్షల రూపాయలు దండుకున్న వ్యవహారం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంగా మారింది. దీంతో సదరు ఎమ్మెల్యేపై ఇంటలీజెన్స్ వర్గాలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
( కరీంనగర్ జిల్లా..న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి )
ఎమ్మెల్యేల అనుమతితోనే ఆయన నియోజకవర్గంలో పోలీసు స్టేషన్ల వారిగా పోలీసు పోస్టింగ్లుంటాయనేది ఓపెన్ సిక్రెట్.. ఇప్పుడు అదే అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పోస్టింగ్‌ల కోసం పోలీసు అధికారుల వద్ద డబ్బులు గుంజెందుకు ఆయుధంగా మార్చుకున్నాడు. అంతే కాదు ఒకే పోస్టుకు ఒకరికంటే ఒకరి వద్ద ఎక్కువ డబ్బులు తీసుకుని ముగ్గురిని కాదని నలుగవ వ్యక్తికి సిఫారసు లేఖ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్యే వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించి ప్రభు త్వానికి అందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది . దీనిపై ఇంటెలిజెన్స్ విచారణలో బయటకొచ్చిన ఈ ఎమ్మెల్యే అవినీతి బాగోతాలు సంచలనం సృష్టిస్తున్నాయి . ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఓ పోస్టు కోసం మొదట ఓ సీఐతో రూ .15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు . ఇందులో భాగంగా తన ప్రైవేట్ పీఏ ద్వారా రూ .10 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యే మరో సీఐ రూ .18 లక్షలు ఆఫర్ ఇవ్వడంతో అతనికి సిఫార్సు లేఖనిచ్చి పోస్టింగు ఇప్పించారు . దీంతో ముందు డబ్బులిచ్చిన సీఐ వెళ్లి ఆరాతీయగా ఎక్కడైనా చూద్దాంలే అంటూ దాటవేశారని , తన డబ్బులు తిరిగివ్వాలని అడుగుతున్నా నాలుగు నెలలుగా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని విచారణలో బయటపడింది .
ఇదే నియోజకవర్గంలో మరో సీఐ పోస్టు కోసం ఒక అధికారి నుంచి రూ .10 లక్షలకు డీల్ చేసుకొని సిఫారసు లేఖ ఇచ్చారు . ఇదే సీఐ పోస్టింగ్ కోసం కరీంనగర్లో పనిచేస్తున్న మరో సీఐ నుంచి రూ .13 లక్షలకు ఒప్పందం చేసుకొని అడ్వాన్స్ రూ .3 లక్షలు తీసుకొని ఆయనకు కూడా సిఫారసు లేఖ ఇచ్చారు . ఇది తెలిసిన తొలి ఇన్స్పెక్టర్ వెళ్లి ఎమ్మెల్యేను అడగ్గా .. రూ .15 లక్షలిస్తే పోస్టింగ్ ఆర్డర్స్ ఇప్పిస్తానని చెప్పడంతో ముందు ఇచ్చిన రూ . 10 లక్షలు వెనక్కి రావేమో అని భయపడి మరో రూ .5 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది .
ఇలా ఇష్టారాజ్యంగా సిఫారసు లేఖలు
నియోజకవర్గంలో భారీస్థాయిలో డిమాండ్ ఉన్న ఓ పోలీస్ స్టేషన్లో పోస్టింగు కోసం ఓ ఎస్ఐకి రూ .11 లక్షలకు కమిట్మెంట్ ఇచ్చారు . అందులో భాగంగా ఓ మండల ఎంపీపీ భర్త ద్వారా రూ .4 లక్షలు అడ్వాన్స్ తీసుకొని పోస్టింగ్ కల్పించారు . పోస్టింగ్ వచ్చాక మిగతా మొత్తం చెల్లించారు . ఆరు నెలలు గడిచాయో లేదో .. సంబంధిత ఎస్ఐ తన మాట వినడం లేదని ఇంకో ఎస్ఐతో రూ .15 లక్ష లకు బేరం కుదుర్చుకుని సిఫారసు లేఖ ఇచ్చాడు . ఇంతలోనే విషయం తెలిసి ప్రస్తుతం ఉన్న ఎస్ఐ వెళ్లి అడగడంతో .. ఇంకో రూ .4 లక్షలు ఇస్తే ఏడాది కంటిన్యూ చేస్తానని చెప్పడంతో సదరు ఎస్ఐ మరో రూ .4 లక్షలు ముట్టజెప్పుకోవాల్సి వచ్చింది .
ఇదే మండల ఠాణాకు పక్కనే ఉన్న మరో మండల ఠాణా కోసం కరీంనగర్ త్రీటౌన్‌లో ఓ ఎస్ఐ నుంచి రూ .10 లక్షలకు కమిటై రూ .3 లక్షల అడ్వాన్స్ తీసుకొని సిఫారసు లేఖ ఇచ్చా రు . మళ్లీ మానకొండూర్‌లో పనిచేస్తున్న ఓ ఎస్ ఐతో రూ .15 లక్షలకు ఒప్పందం కుదరడంతో అతడికి పోస్టింగ్ ఇప్పించే ప్రయత్నం చేశారు . ఇక ఓ మంత్రి సన్నిహితుడి సోదరుడి పోస్టింగు కోసం రూ .15 లక్షలు తీసుకొని పోస్టింగ్ వచ్చేలా చూడగా , మరో స్టేషన్ ఇంకో మంత్రి సిఫారసు చేసినా , సంబంధిత ఎస్ఐ నుంచి రూ .5 లక్షలు తీసుకొని పోస్టింగ్ ఇప్పించినట్టు ఇంటెలిజెన్స్ విచారణలో బయటపడింది .
అయితే.. పొలిటికల్ పోస్టింగుల వ్యవహారంలో డబ్బులు తీసుకొని మోసం చేసిన ఘటనలు ప్రభుత్వ పెద్దలను ఆగ్రహానికి గురిచేసినట్టు తెలిసింది . సదరు ఎమ్మెల్యేపై పోలీస్ ఉన్నతా ధికారులతో పాటు మంత్రులు ఫిర్యాదు చేసి నట్లు తెలిసింది . అధికారుల నుంచి డబ్బులు తీసుకొని తిరిగివ్వకుండా చేస్తున్న వ్యవహా రంపై ప్రభుత్వ పెద్దలకు ఇంటెలిజెన్స్ నివేదిక అందినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.