Home /News /telangana /

ONE MORE PREGNANT WOMAN GOT TROBLE WITH OUT DOCTERS AT RIMS OF ADILABAD VRY

Adilabad : ఆదిలాబాద్‌‌ను వీడని వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణిలు అవస్థలు పడాల్సిందేనా...?

పసిబిడ్డను ఎత్తుకుని వాగుదాటుతున్న మహిళ

పసిబిడ్డను ఎత్తుకుని వాగుదాటుతున్న మహిళ

Adilabad : మారుమూల ప్రాంతాల గర్భిణిలు వైద్యం అందక చనిపోవాల్సిందేనా... ఆధునిక వైద్యసదుపాయాలు ఉన్నాయంటున్న ప్రభుత్వ మాటలు.. మారుమూల గూడాలకు చేరడం లేదా.. వైద్యం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నా వాటి ఫలితాలు ఎవరికి దక్కుతున్నాయి..? గిరిజన తండాల గర్భిణిలు వాగులు దాటి , వైద్యులు లేక ప్రాణాలు కోల్పోవల్సిందేనా...?

ఇంకా చదవండి ...
  ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా  (  Adilabad )గిరిజన గూడాలు, ఆదివాసి తండా మహిళల కష్టాలు వర్ణానాతీతంగా తయారయ్యాయి. వర్షాకాలం వచ్చిందంటే మారుమూల ప్రాంతాల నుండి కిలోమీటర్ల మేర నిండు గర్భిణిలే (pregnant woman) కాకుండా పచ్చి బాలింతలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గర్భిణి మహిళలు ఎండ్లబండ్లు, నడక దారుల్లో వెళుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా వైద్య కేంద్రాల్లో కూడా సరైన వైద్యులు లేకపోవడంతో గర్భిణి మహిళలు మరిన్ని చుక్కులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

  ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ (RIMS) ఆసుపత్రిలో ఓ నిండు గర్భిని తన కడుపులో ప్రాణం పోయిన పిల్లాడిని పెట్టుకుని ఆపరేషన్ కోసం ఆసుపత్రి ముందు రెండు పాటు పడిగాడుపులు కాస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో గర్భీణి స్త్రీల కోసం గైనకాలజీ , అనష్ధీషియా వైద్యులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలానికి చెందిన నిండు గర్భిణి కడుపులో ఉన్న పాప చనిపోయిందని.. మృత శిశువును తీయాలని హసీనా అనే గర్భిణి రెండు రోజులుగా వేడుకుంటుంటే వైద్యులు లేరని చెబుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

  ఇది చదవండి : MBA విద్యార్థిని రేప్‌ కేసులో 5గురు అరెస్ట్..అందులో ఒకరు మైనర్.. ఎన్‌కౌంటర్ చేయాలన్న సీఎం


  గత నాలుగు రోజుల క్రతమే నిండు గర్భిణికి సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రాణాలు విడించింది. జిల్లాలోని కునికాస కోలంగూడ గ్రామానికి చెందిన నిండు గర్భిణి సడెన్‌గా ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేసినా ఫలితం దక్కలేదు.. వర్షాలు(Rains) విపరీతంగా కురుస్తుండడంతో వాగులు పొంగి పొర్లుతుండడంతో గర్బిని చేతుల మీదుగా వాగు దాటించి అంబులెన్స్ ద్వార సమీపంలోని గాదిగూడ పీహెచ్‌సీలో వైద్యం (phc) కోసం తీసుకువచ్చినా వైద్యులు (Doctors) అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుండి రిమ్స్‌కు బయలు దేరే దారిలోనే ఆమె ప్రాణాలు విడిచింది.

  ఇది చదవండి : చంచల్‌గూడ జైలుకు తీన్మార్ మల్లన్న ..! 14 రోజుల రిమాండ్

  దీంతో సంఘటన పై స్పందిచిన కలెక్టర్(collector) సిక్తా పట్నాయక్ నేరుగా వాగును దాటుకుంటూ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లింది. ఇలా పిహెచ్‌సీల తోపాటు జిల్లా ఆసుపత్రిలో కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడం గర్భిణి పాలిట శాపంగా మారుతోంది. కాగా వర్షాకాలం నుండి జిల్లా వ్యాప్తంగా ఇలాంటీ సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.. గర్భిణిలకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇవ్వాల్సిన వారు అందుబాటులో లేకపోవడంతో ఇలాంటీ సంఘటనలు పునారావృతం అవుతున్నాయి. అయితే ఇలాంటీ సంఘటనలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారుతోంది.

  మరోవైపు అంబులెన్స్ డ్రైవర్స్ సైతం బాధితులను డబ్బులు డిమాండ్ చేయడం లేదంటే రోడ్డు మార్గం సరిగా లేదంటూ మధ్యలోనే వదిలేయడం లాంటీ సంఘటనలతో పచ్చి బాలింతలు సైతం మూడు నాలుగు కిలోమీటర్లు నడవాడాల్సిన పరిస్థితి దాపురించింది.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Adilabad, Pregnant women

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు